Allu Arjun: మెగాస్టార్ చిరంజీవి స్పూర్తితో ఇండస్ట్రీకి వచ్చిన అల్లు అర్జున్ ఆనతి కాలంలోనే స్టార్ హీరోగా ఎదిగాడు. పాన్ ఇండియా రేంజ్‌కి ఎదిగిన అల్లు అర్జున్‌కి ఇప్పడు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఏర్పడ్డారు. అయితే ఇటీవల మెగా కుటుంబం వర్సెస్ అల్లు అర్జున్ వివాదం క్రమేపి పెరుగుతోంది. కుటుంబసభ్యుల సంగతెలా ఉన్నా ఇరువురి అభిమానులు మాత్రం వివాదాన్ని రచ్చ చేస్తూ… సోషల్ మీడియా సాక్షిగా వార్ పెంచుతున్నారు.
ఇటీవల చిరంజీవి, పవన్ కళ్యాణ్, రామ్‌చరణ్ అభిమానులు చేసిన ఓ పని..బన్నీ అభిమానుల ఆగ్రహాన్ని కట్టలు తెంచేలా చేయడం మనం చూశాం. ఇక ఈ వార్ ఎంత వరకు వెళ్లిందంటే.. అల్లు రామలింగయ్య కారణంగానే చిరంజీవి ఇండస్ట్రీలో నిలదొక్కుకున్నారని..బన్నీ అభిమానులు చెప్పుకురాగా,.మెగా కుటుంబం లేకపోతే మీరెక్కడంటూ చిరు అభిమానులు విమర్శలు చేశారు.
కుటుంబసభ్యులు, రెండు కుటుంబాల మధ్య అంతర్గతంగా ఎలా ఉన్నా..ఫ్యాన్స్ మాత్రం వార్ తో నానా రచ్చ చేస్తున్నారు. ఈ క్రమంలో అల్లు అర్జున్ సంచనల కామెంట్స్ తో మరో సారి హీట్ పెంచాడు. తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 2 కి గెస్ట్ గా విచ్చేసిన అల్లు అర్జున్.. మా నాన్న నాకు దైవంతో సమానం అని అన్నాడు.
అంతేకాదు నేను చూసిన దేవుడు ఆయనే. నాకు అన్నీ ఇచ్చిన నాన్నే నాకు దేవుడు అని, తన ఫేమ్ నేమ్ కి కారణం నాన్న మాత్రమే అన్నట్లు అల్లు అర్జున్ వ్యాఖ్యలు చేయడంతో మళ్లీ మెగా వర్సెస్ అల్లు వార్ ఊపందుకుంది. ఇప్పుడు దీనిపై సోషల్ మీడియాలో ఏ రేంజ్లో వార్ నడుస్తుందనేది ఆసక్తికరంగా మారింది.
ఇక కార్యక్రమంలో బన్నీ నటించిన ‘పిలగా నువు ఇరగ ఇరగ’ సాంగ్ ని శృతి అనే సింగర్ గొప్పగా పాడింది. అల్లు అర్జున్ తెగ ఇంప్రెస్ అయ్యాడు. ఆమెకు తన సంతకంతో కూడిన బ్యాండ్ ఇచ్చాడు. ఇక శృతి పేరు అన్నా కూడా నాకు చాలా ఇష్టం అని చెప్పాడు.. ఎందుకంటే నా ఫస్ట్ లవర్ పేరు శృతినే, అని గట్టిగా నవ్వారు. అంటే స్నేహారెడ్డి కంటే ముందే అల్లు అర్జున్ శృతి అనే అమ్మాయిని ప్రేమించాడన్నవాదన ఇప్పుడు మొదలైంది.
ఈ క్రమంలో స్నేహారెడ్డి ఫీలింగ్ ఏమై ఉంటుందని కొందరు మాట్లాడుకుంటున్నారు . కాగా అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 షూట్‌తో బిజీగా ఉన్నారు. ఈ మూవీచిత్రీకరణ ముగిసిందని సమాచారం. డిసెంబర్ లోనే పుష్ప 2 రావచ్చని తెలుస్తుంది. పుష్ప 1 క్రిస్మస్ కానుకగా విడుదలై మంచి విజయం సాధించిన విషయం తెలిసిందే.
read more news :
Allu Arjun: 30 ఏళ్ల తర్వాత టీచర్ని కలిసిన అల్లు అర్జున్.. ఆమె పాదాలకు మొక్కి..
Allu Arjun: రేయ్.. అవినాష్ అంటూ జబర్ధస్త్ కమెడీయన్‌కి వార్నింగ్ ఇచ్చిన బన్నీ ఫ్యాన్స్