Telugu Flash News

అల్లరి నరేష్‌ ‘నా సామిరంగ’ గ్లింప్స్‌ ఆకట్టుకుంది

allari naresh in na saami ranga

అగ్ర హీరో నాగార్జున, అల్లరి నరేష్‌ హీరోలగా నటిస్తున్న చిత్రం ‘నా సామిరంగ’. మాస్‌, యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకురానుంది.
శుక్రవారం అంజి పాత్రలో అల్లరి నరేష్‌ గ్లింప్స్‌ను విడుదల చేశారు. పల్లెటూరి నేపథ్యంలో ఇద్దరి మధ్య స్నేహబంధాన్ని ఆవిష్కరిస్తూ గ్లింప్స్‌ ఆకట్టుకుంది.

గ్లింప్స్‌లో అల్లరి నరేష్‌ తనదైన స్టైల్లో మాస్‌ స్టెప్పులేస్తూ, మాటొచ్చేత్తది అంటూ డైలాగ్‌తో అదరగొట్టాడు. ఇందులో నాగార్జునతో అల్లరి నరేష్‌ మధ్య మంచి బాండింగ్‌ కనిపించింది. సినిమాలో వీరిద్దరి మధ్య అనుబంధం ప్రధానాకర్షణగా నిలుస్తుందని మేకర్స్‌ ప్రకటించారు.

ఈ చిత్రానికి కెమెరా: దాశరథి శివేంద్ర, సంగీతం: ఎం.ఎం.కీరవాణి, కథ, మాటలు: ప్రసన్నకుమార్‌ బెజవాడ, దర్శకత్వం: విజయ్‌ బిన్ని. శ్రీనివాసా సిల్వర్‌ స్క్రీన్స్‌ పతాకంపై శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకురానుంది.

Exit mobile version