HometelanganaTS EAMCET : ఎంసెట్‌కు సర్వం సిద్ధం.. అదనంగా 50 వేలకుపైగా దరఖాస్తులు

TS EAMCET : ఎంసెట్‌కు సర్వం సిద్ధం.. అదనంగా 50 వేలకుపైగా దరఖాస్తులు

Telugu Flash News

తెలంగాణ ఎంసెట్‌ (TS EAMCET) కు సర్వం సిద్ధమైంది. ఈనెల 10వ తేదీ నుంచి 14 వరకు ఎంసెట్‌ అగ్రికల్చర్‌, ఇంజనీరింగ్‌ పరీక్షలు నిర్వహించనున్నారు. మే 10, 11న అగ్రికల్చర్‌, మెడికల్‌, 12, 13, 14 తేదీల్లో ఇంజనీరింగ్‌ పరీక్షలు జరపనున్నారు. ఇందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

ఇంజనీరింగ్, అగ్రికల్చర్, మెడికల్ పరీక్షలు కంప్యూటర్ ఆధారితంగా నిర్వహించనున్నారు. మరోవైపు ఎంసెట్ సహా అన్ని ప్రవేశ పరీక్షలకు పకడ్బందీగా ఏర్పాటు చేశామని తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ లింబాద్రి వెల్లడించారు.

ఇవాళ హైదరాబాద్‌ నగరంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ప్రొఫెసర్‌ లింబాద్రి మాట్లాడారు. తెలంగాణ ఎంసెట్‌కు ఈ ఏడాది భారీగా దరఖాస్తులు వచ్చాయన్నారు. అదనంగా 50 వేల అప్లికేషన్లు వచ్చాయని పేర్కొన్నారు.

అయితే, ఇప్పటి వరకు సుమారు 2 లక్షల మందికిపైగా విద్యార్థులు తమ హాల్ టికెట్లను డౌన్‌లోడ్‌ చేసుకున్నాయని లింబాద్రి వెల్లడించారు. రెండు రోజుల కిందట తెలంగాణ ఎంసెట్‌కు సంబంధించిన హాల్‌ టికెట్లు అందుబాటులోకి వచ్చాయి.

తెలంగాణ ఎంసెట్‌కు 28 కొత్త కేంద్రాలతో పాటు మొత్తం 137 ఎగ్జామ్‌ సెంటర్లను ఏర్పాటు చేసినట్లు ప్రొఫెసర్‌ లింబాద్రి పేర్కొన్నారు. స్టూడెంట్లు నిర్ణీత సమయానికే పరీక్ష కేంద్రానికి చేరుకొనేలా ప్లాన్‌ చేసుకోవాలన్నారు.

నిమిషం ఆలస్యమైనా కూడా అనుమతించేది లేదని ముందుగానే విద్యార్థులకు హెచ్చరించారు. ఇక లాసెట్‌ను ఒకేరోజు మూడు సెషన్లలో నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఈసెట్‌ ఒకే పూటలో పూర్తి చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.

-Advertisement-

మరోవైపు ప్రైవేట్‌ యూనివర్సిటీల బిల్లు ప్రాసెస్‌లో ఉందని ప్రొఫెసర్‌ లింబాద్రి పేర్కొన్నారు. జవహరల్‌లాల్‌ నెహ్రూ టెక్నలాజికల్‌ యూనివర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ ఆచార్య కట్టా నర్సిరెడ్డి మాట్లాడుతూ.. ఈ ఏడాది కొత్తగా బయోటెక్నాలజీ కోర్సును ప్రవేశపెట్టబోతున్నట్లు వివరించారు. కొత్త కోర్సుల కోసం ప్రైవేట్‌కాలేజీల దరఖాస్తులు ఏఐసీటీఈ పరిశీలనలో ఉన్నాయని తెలిపారు.

కళాశాలల్లో తనిఖీలు నాలుగైదు రోజుల్లోనే పూర్తి చేస్తామన్నారు. తెలంగాణ స్టేట్‌ ఇంజనీరింగ్‌, అగ్రికల్చర్‌ అండ్‌ మెడికల్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌-2023ని జేఎన్టీయూ హైదరాబాద్‌, తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ (TSCHE) తరఫున నిర్వహిస్తున్నారు.

2023-2024 విద్యా సంవత్సరానికి తెలంగాణ రాష్ట్రంలోని యూనివర్సిటీ/ప్రైవేట్ కాలేజీల్లో అందించే వివిధ ప్రొఫెషనల్ కోర్సుల్లో ప్రవేశానికి ఈ పరీక్ష తప్పనిసరిగా రాయాల్సి ఉంటుంది.

also read :

Samantha: టార్చ‌ర్ టైం అంటున్న సమంత‌.. ఐస్ గడ్డల తొట్టెలో అలా కూర్చుందేంటి..!

Mahesh Babu: మ‌హేష్ బాబు దుబాయ్‌లో కాస్ట్ లీ విల్లా కొనుగోలు చేశాడా.. ఇందులో నిజ‌మెంత‌?

 

 

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News