Telugu Flash News

12 Jyotirlingas in India | జ్యోతిర్లింగాలు ఎన్ని అవి ఎక్కడ ఉన్నాయి.. వాటి విశేషాలు

12 jyothirlinga temples in india

12 jyothirlinga temples in india

ద్వాదశ జ్యోతిర్లింగాలు..వాటి విశేషాలు : భక్తుల జీవితాలలోని అంధకారాన్ని తొలగించి జ్యోతులను నింపే శివలింగాన్ని జ్యోతిర్లింగము అంటారు. అంటువంటి జ్యోతిర్లింగాలు ఎన్ని అవి ఎక్కడ ఉన్నాయి,  మన దేశంలో 12 జ్యోతిర్లింగాలు (12 jyotirlingas in india) ఉన్నాయి. 

జ్యోతిర్లింగ స్తోత్రము

సౌరాష్ట్ర సోమనాథంచ శ్రీశైలే మల్లికార్జునం ఉజ్జయిన్యాం మహాకాళం ఓంకారేత్వమలేశ్వరం పరల్యాం వైద్యనాథంచ ఢాకిన్యాం భీమశంకరం సేతు బంధేతు రామేశం నాగేశం దారుకావనే వారణాశ్యాంతు విశ్వేశం త్ర్యంబకం గౌతమీతటే హిమాలయేతు కేదారం ఘుశ్మేశంచ శివాలయే ద్వాదశైతాని నామాని ప్రతారుత్థాయ యః పఠేత్ సర్వపాప వినిర్ముక్తః సర్వసిద్ధి ఫలం లభేత్ |

జ్యోతిర్లింగాలు ఎన్ని అవి ఎక్కడ ఉన్నాయి

సోమనాథుడు(Somnath)

Somnath Temple

గుజరాత్ లోని సౌరాష్ట్ర ప్రాంతంలో ఉన్నది. సోమనాథ లింగము. త్రేతాయుగములో రావణాసు రుడు ఇచ్చట తపస్సు చేసి తన పది తలలను పరమ శివునికి సమర్పించాడని అంటారు. ద్వాపర యుగములోని శ్రీకృష్ణుడు ఈ లింగాన్ని ఆరాధించినట్లు పురాణాలు చెప్పుచున్నాయి. ఈ ఆలయంపై గజనీ మహమ్మద్ అనేకసార్లు దండయాత్ర చేసి విగ్రహాన్ని ధ్వంసం చేసినట్లు చరిత్ర చెప్పుచున్నది. తరువాతి కాలంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ ఈ లింగాన్ని పునః ప్రతిష్టించారు. ఈ ఆలయం గుజరాత్ లోని సౌరాష్ట్ర ద్వీపకల్పం దక్షిణ ద్వీపభాగంలోని ముఖ్యమైన సముద్రరేవు పట్టణం వీరవల్ కు సమీపంలో కలదు.

శ్రీశైలం(Mallikarjuna)

srisailam mallikarjuna swamy temple

ఇది కర్నూలు జిల్లా లో దొర్నాలకు 56 కిలో మీటర్ల దూరంలో మల్లి కార్జున స్వామిగా జ్యోతిర్లింగ రూపంలో వెలసియున్నారు. ఇది రెండవ జ్యోతిర్లింగము. దీనిని మల్లికార్జున మహా లింగం అని అంటారు. చంద్రగుప్తుడనే రాజుకు చంద్రవతి అనే కుమార్తె ఉండేది. ఆమెను వివాహం చేసుకొనటానికి ఎందరో రాకుమారులు పోటీపడు తుండగా, ఆమె ఎటూ చెప్పలేక రాజ భవాన్ని వదలి శ్రీపర్వతంమీద తపస్సు చేసినదట. ఆమె తపస్సుకు మెచ్చి పరమశివుడు ప్రత్యక్షమై వరం కోరుకొమ్మని అనగా ఆమె అల్లిన మల్లెపూలదండ పరమశివుని శిరస్సును గంగలాగ అలంకరించి ఉండాలని కోరుకోవడం వల్ల మల్లిక అర్జునుడు అనే పేరు వచ్చినది అంటారు.

మహాకాలేశ్వరుడు(Mahakaleshwar)

mahakaleshwar jyotirlinga temple

ఇది మూ డవ జ్యోతిర్లింగము. ఇది మధ్య ప్రదేశ్ లోని భోపాల్‌కు 120 కి.మీ. దూరంలోను, ఇండోరకు 50 కి.మీ. దూరంలోను కలదు. దీనినే అవంతిపురం అని కూడా అంటారు. ఇది సప్తమోక్ష పురాలలో ఒకటిగా ప్రసిద్ధిచెందినది. ఇచ్చట ప్రాతఃకాలమున నాలుగు గంటల సమ యంలో స్మశానవాటిక నుండి నేరుగా తెచ్చిన భస్మంతో స్వామి వారికి అభిషేకము జరుగును. నేటి ఉజ్జయినికి ప్రాచీన నామము అవంతి. మార్కండేయుని రక్షించ టానికి కాలుడైన యుముణ్నే సంహరించిన ఘనత ఈయనకు ఉండటం వల్ల మహాకాలుడు అనే పేరు స్థిరపడింది. తరువాత జైన మతస్థుడైన ఒక రాజు అవంతిని ఉజ్జయినిగా మార్చాడు.

ఓంకారేశ్వరము(Omkareshwar)

omkareshwar jyotirlinga temple

ఇది నాల్గవ జ్యోతిర్లింగము. ఇది ఇండో రకు సుమారు 50 కి.మీ. దూరంలో ఓం కారేశ్వర్ రోడ్ అనే రైల్వే స్టేషను 10 కి.మీ. దూరంలో కలదు. మధ్య ప్రదేశ్ లో రెండు వైపులా వింధ్య పర్వతాల నడుమ, నర్మదా కావేరీ నదుల మధ్య ఉన్న క్షేత్రం ఇది. సూర్యవంశ రాజైన మాంధాత అడవికి వెళ్ళినప్పుడు ధూపపదీప నైవేద్యాలు లేని ఒక శివలింగం కనబడింది. ఆ లింగం నుంచి ‘ఓం’ అనే ప్రణవనాదం వినిపి స్తోంది. అప్పుడు కొందరు ఋషుల్ని, పండితుల్ని అక్కడకు తీసుకెళ్ళగా ఆ లింగానికి ఓంకారేశ్వరుడు అని పేరు పెట్టారు. మాంధాత మహారాజు ఓంకారేశ్వరునికి గొప్ప దేవాలయం నిర్మించి పూజలు చేశారు.

కేదారేశ్వరము(Kedarnath)

kedarnath jyotirlinga temple

ఇది అయిదవ జ్యోతిర్లింగము. ఇది ఉత్తరాంచల్ రాష్ట్రంలోని గౌరీ గుండ్ కు సమీ పంలో కలదు. ఇచ్చట నుండి 13 కి.మీ. పర్వత ప్రాంతంలో ప్రయా ణించి కేదారేశ్వర లింగమునకు చేరవలెను. సముద్రమట్టానికి 11,500 అడుగుల ఎత్తులోగల ఈ కేదారేశ్వర లింగము హిమాలయ పర్వతముపై ఉన్నది. ఈ ఆలయాన్ని పాండవులు నిర్మించారని అంటారు.

భీమశంకరము(Bhimashankar)

Bhimashankar jyotirlinga temple

ఇది ఆరవ జ్యోతిర్లింగము. ఇది పూణెకు సమీపంలోని మంచర్ గ్రామము నుండి సహ్యాద్రి పర్వత శ్రేణులలో కలదు. ఇచ్చట భీమానది ప్రవహించుట వలన ఈ లింగమునకు భీమశంకరము అని కూడా పిలుస్తారు. ఈ ప్రాంతానికి ఢాకిని అని మరో పేరుకూడా కలదు. ఢాకిని అనగా దక్ష ప్రజాపతి కుమార్తె దాక్షాయణి. పరమశివునికై ఆమె తపస్సు చేసిన భూమి ఇది.

వారణాసి(Kashi Vishwanath)

kashi vishwanath temple

ఇది ఏడవ జ్యోతి ర్లింగము. ఇది ఉత్తరప్రదేశ్ లోని గంగానది తీరమున ఉన్నది. వారణ, అసి అని రెండు నదుల సంగమము వలన వారణాసి అయినది. ఇచ్చట స్వామివారిని విశ్వేశ్వరుడు అని మరో పేరుతో కూడా పిలుస్తారు. కాశీలోని మరణించిన మోక్షము ప్రాప్తించునని పురాణాల ద్వారా తెలుస్తున్నది.

త్రయంబకేశ్వరము(Trimbakeshwar)

trimbakeshwar jyotirlinga temple

ఇది ఎనిమిద జ్యోతిర్లింగము. jyotirlinga in maharashtra మహారాష్ట్రలోని నాసిక్ పట్టణానికి 30 కి.మీ. దూరంలో గోదావరి నది పుట్టిన నాసికాత్ర్యంబకం అనే చోట సహ్యాద్రి పర్వతాలపై వెలసి ఉన్నది. ఇచ్చట పంచవటి అని పేరుగల అయిదు వటవృక్షాలసము దాయములో సీతా లక్ష్మణసమేతుడైన శ్రీరాముడు వనవాసము చేసినట్లు ప్రతీతి.

వైద్యనాదం(Vaidyanath)

vaidyanath jyotirlinga temple

ఇది తొమ్మిదవ జ్యోతిర్లింగము.ఇది జార్ఖండ్ రాష్ట్రంలోని జెనీడి రైల్వే స్టేషన్ కు సమీపంలో కలదు. ఈ జ్యోతిర్లింగాన్ని స్పృశించుట వలన దీర్ఘవ్యాధులు సయితం నయముకాగలవని, వైద్యం చేయువాడు కనుక ఇతనికి వైద్యనాదేశ్వరుడని పేరు వచ్చినదని ప్రతీతి. క్షీరసముద్ర మథనంలో బయటపడిన దేవతా వైద్యుడు ధన్వంతరి ప్రతిష్టించిన లింగమని భావించినందువలన ఈ జ్యోతిర్లింగానికి అధిక ప్రాధాన్యత లభించినది.

నాగేశ్వరము(Nageshwar)

nageshwar jyotirlinga temple

ఇది పదవ జ్యోతిర్లింగము. గుజరాత్ రాష్ట్రంలోని ద్వారకా పట్టణ మునకు 5 కి.మీ. దూరంలో ఈ ఆలయము కలదు. ద్వారకా పట్టణా నికి సమీపంలోని దారుకా వనంలో ఈ లింగము కలదు. దారకుడు అను రాక్షసుని దుచేష్టలనుండి కాపాడమని సుప్రియుడు అనే భక్తుడు కోరగా పరమశివుడు దారకుని సంహరించి ప్రజలను కాపాడాడని చెప్పుదురు. సుప్రియుని కోరిక మేరకు నాగేశ్వర లింగము రూపంలో దారుకావనంలో పరమశివుడు స్థిరపడ్డాడు.

రామేశ్వరము(Rameshwaram)

rameshwaram jyotirlinga temple

ఇది పదకొండవ జ్యోతిర్లింగము. ఇది తమిళనాడు రాష్ట్రంలోని రామనాథ్ జిల్లాలోని రామేశ్వరం రైల్వే స్టేషన్ కు సమీపంలో కలదు. తర్వాతి కాలంలో సముద్రముపై నుండి రోడ్డు వంతెనను కూడా రామేశ్వర క్షేత్రానికి నిర్మించుట జరిగి నది. శ్రీరాముడు ప్రతిష్టించిన ఈశ్వరుడు కనుక రామేశ్వరుడు అని పేరు వచ్చినది. లంకాధిపతి రావణుని జయించటానికి శ్రీరాముడు సముద్రము మీద సేతువు నిర్మిస్తాడు. తామ్రపర్ణి అనే నది ఇచ్చట సముద్రంలో కలియను.

ఘృష్ణేశ్వరము(Grishneshwar)

Grishneshwar jyotirlinga temple

ఇది పన్నెండవ జ్యోతిర్లింగము. మహారాష్ట్రలోని ఔరాంగాబాదు సమీపంలోని ఎల్లోరా గుహ లకు అతి సమీపంలో ఈ దేవాలయం కలదు. ఒక నాడు పార్వతీదేవి తన ఎడమ అరచేతిలోని కుంకుమను కుడిచేతి ఉంగరపు వ్రేలితో రుద్దు చుండగా, ఆ ఘర్షణకు ఓ జ్యోతి ప్రజ్వరిల్లినది. దానిని అచ్చటనే ఉన్న శివలింగములో ప్రవేశపెట్టినదని కథనము. ఈమె వేలి ఘర్షణకు ఆవిర్భవించిన లింగము కనుక ఘృణేశ్వర లింగము అని పేరు వచ్చినదని తెలియుచున్నది.

ఇవి కూడా చదవండి : 

Maha Shivaratri : శివరాత్రి జాగారం నాడు ఏం చేయాలి? ఎలా చేస్తే శివానుగ్రహం సిద్ధిస్తుంది?

maha shivaratri : మహాశివరాత్రి రోజున చేయకూడని పనులు ఇవే.. పరమేశ్వర అనుగ్రహం కోసం ఇలా చేయండి..

Maha Shivaratri 2023 : ఈ గుడిలో మోడ్రన్ డ్రెస్సులు నిషేధం.. శివరాత్రి రోజున సంప్రదాయానికి ప్రాధాన్యత..

Maha Shivratri : మహా శివరాత్రి నాడు ఉపవాసం వల్ల ఫలితమేంటి?

jyotirlingas in maharashtra : మహారాష్ట్రలోని 5 జ్యోతిర్లింగాలు

Exit mobile version