HomecinemaRajamouli: రాజ‌మౌళి స్కెచ్ మాములుగా లేదు.. మ‌హేష్ సినిమా కోసం ఏ హీరోయిన్‌ని ప‌ట్టుకొస్తున్నాడో తెలుసా?

Rajamouli: రాజ‌మౌళి స్కెచ్ మాములుగా లేదు.. మ‌హేష్ సినిమా కోసం ఏ హీరోయిన్‌ని ప‌ట్టుకొస్తున్నాడో తెలుసా?

Telugu Flash News

Rajamouli: తెలుగు సినిమా ఖ్యాతి ఎల్ల‌లు దాటించేలా చేసిన ద‌ర్శ‌క ధీరుడు రాజ‌మౌళి రీసెంట్‌గా ఆర్ఆర్ఆర్ అనే చిత్రంతో మ‌రో సూప‌ర్ హిట్ త‌న ఖాతాలో వేసుకున్న విష‌యం తెలిసిందే. ఈ సినిమా ఇచ్చిన ఉత్సాహంతో మ‌హేష్‌తో ఓ సినిమా ప్లాన్ చేస్తున్నాడు.

భారీ బ‌డ్జెట్‌తో అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా ఈ సినిమా రూపొందుతుంది. ఈ సినిమాకి సంబంధించి వ‌స్తున్న వార్త‌లు అంద‌రిలో ఆస‌క్తిని పెంచుతున్నాయి. ఇక ఈ సినిమాని కేఎల్ నారాయణ నిర్మించబోతున్నారు. రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ కథ అందిస్తున్నారు. దీనికోసం ఆయన రెండు కథలు సిద్ధం చేసినట్లు చెప్పుకొచ్చారు.

క్రేజీ భామ‌తో..

అమెజాన్ అడవులలో ఉన్న నిధి వేటగా సినిమాని రూపొందిస్తున్నారు. ఈ చిత్ర క‌థ జేమ్స్ బాండ్ తరహా అడ్వెంచర్స్ కథ అని తెలుస్తోంది. ప్రపంచ యాత్రికుడి పాత్ర‌లో కనిపించబోతున్న మహేష్ బాబు ఎలాంటి యాక్షన్ అడ్వెంచర్స్ చేస్తారనేది ఆసక్తికరంగా మారనుంది.

ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. అయితే ఈ సినిమాలో ఆర్ఆర్ఆర్ బ్యూటీ అలియా భ‌ట్‌ని క‌థానాయిక‌గా తీసుకోవాల‌ని జ‌క్క‌న్న భావిస్తున్నాడ‌ట‌. ఓవర్సీస్ సెన్సార్ బోర్డు సభ్యుడు ఉమైర్ సందు.. మహేష్ కి జంటగా అలియా భట్ నటిస్తున్నట్లు వెల్లడించాడు.

ప్ర‌స్తుతం గర్భంతో ఉన్న అలియా భట్ డెలివరీ తర్వాత రాజమౌళి త‌ర్వాతి షూట్ లో పాల్గొంటారట. దీనిపై అధికారిక సమాచారం లేకున్నప్పటికీ దీనికి సంబంధించిన వార్త‌లు తెగ హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి. ప్రస్తుతానికి మహేష్ బాబు త్రివిక్రమ్ తో తన 28వ సినిమా చేస్తున్న విష‌యం తెలిసిందే.

హారిక హాసిని బ్యానర్ పై భారీ బ‌డ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ కూడా ప్రారంభమైంది. ఈ సినిమాలో మహేష్ బాబు సరసన పూజా హెగ్డే జ‌త‌క‌ట్ట‌బోతుంది.. ఈ సినిమా షూటింగ్ తరువాత మహేష్ బాబు రాజమౌళితో సినిమా ప్రారంభించనున్నాడు.

-Advertisement-

మరిన్ని సినిమా వార్తలు చదవండి :

Kamal Hassan: ద‌టీజ్ క‌మ‌ల్ హాసన్.. 14 భాష‌ల్లో ప‌ది నిమిషాల డైలాగ్ అవ‌లీల‌గా చేప్పేశాడే..!

bigg boss telugu season 6 : బిగ్ బాస్ లాంచింగ్ ఎపిసోడ్‌కి దారుణ‌మైన‌ టీఆర్పీ రేటింగ్.. బిగ్ బాస్ చరిత్ర‌లో ఇదే తొలిసారి..!

 

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News