Telugu Flash News

పార్టీ ఆదేశిస్తే పవన్ కళ్యాణ్ పై పోటీకి సిద్దం : నటుడు ఆలీ

ఆంధ్రప్రదేశ్ లో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సినీనటుడు ఆలీ ఉత్సాహంగా ఉన్నట్టు తెలుస్తుంది. అయితే పవన్ కళ్యాణ్ పై పోటీకి సిద్ధమని ఆయన చెప్పారు. గత జనరల్ ఎలక్షన్స్ ముందు వైసీపీలో చేరిన సినీనటుడు ఆలీ ఆ పార్టీ తరపున ప్రచారం కూడా చేశారు.

వైసీపీ అధికారంలోకి రాగానే రాజ్యసభ సీటు ఇచ్చి ఎమ్మెల్సీగా అవకాశం కల్పిస్తారని ప్రచారం జరిగింది. గతేడాది అక్టోబర్‌లో ప్రభుత్వ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుగా ప్రభుత్వం నియమించింది. రెండేళ్లపాటు ఆయన ఈ పదవిలో కొనసాగుతారు.

అయితే ఈరోజు నటుడు ఆలీ సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ ఆదేశిస్తే పవన్ కళ్యాణ్ పై పోటీకి సిద్ధమని చెప్పారు. పార్టీ ఆదేశానుసారం ఎక్కడి నుంచైనా పోటీ చేసేందుకు సిద్ధమని ఆలీ తెలిపారు.

సినిమాలు వేరు, రాజకీయాలు వేరు. పవన్ కళ్యాణ్ నాకు మంచి మిత్రుడు అయినప్పటికీ.. పోటీ చేయమని సీఎం జగన్ ఆదేశిస్తే నేను సిద్ధంగా ఉన్నాను’’ అని ఆలీ అన్నారు. 2024 ఎన్నికల్లో వైసీపీ 175 సీట్లు గెలుచుకుంటుందని.. రాష్ట్రానికి ఎవరు మేలు చేశారో ప్రజలందరికీ తెలుసని ఆలీ అన్నారు.

రోజా అంటే ఫైర్ బ్రాండ్, ఎక్కడా ఆమె తగ్గదు. మెగా ఫ్యామిలీతో రోజాకు సత్సంబంధాలు ఉన్నాయని అన్నారు . ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం సహజమేనన్నారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు అలీ ఉత్సాహం చూపిస్తున్నారు. ఏం జరగనుందో వేచి చూడాలి.. రాజకీయాల్లో ఏమైనా జరగవచ్చు..

also read:

AP BRS : ఏపీలో ఆ సామాజికవర్గ ఓట్లపై బీఆర్‌ఎస్‌ ఫోకస్‌.. వచ్చే ఎన్నికల్లో ప్లాన్‌ ఎలా ఉండబోతోంది?

Viral video : మహిళా కార్యకర్తను తదేకంగా చూస్తున్న సిద్ధరామయ్య.. వీడియో వైరల్‌

BRS : ఖమ్మం సభకు మూడు రాష్ట్రాల సీఎంలు.. జాతీయ రాజకీయాలపై కేసీఆర్‌ డిక్లరేషన్‌ ప్రకటిస్తారా?

Exit mobile version