Telugu Flash News

Akira Nandan: సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్న ప‌వ‌న్ కళ్యాణ్ త‌న‌యుడు.. అప్‌డేట్ వ‌చ్చేసింది..!

pawankalyan son akira

Akira Nandan : మెగా ఫ్యామిలీ నుండి ఇప్పటికే ఎంతో మంది హీరోలు ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌యం కాగా, వారిలో చాలా మంది సక్సెస్ అయ్యారు. ఇక ప‌వ‌న్ కళ్యాణ్ త‌నయుడు అకీరా నందన్ కూడా త్వ‌ర‌లో సినీ రంగంలోకి అడుగు పెట్ట‌బోతున్న‌ట్టు ప్ర‌చారాలు సాగాయి. అయితే అకీరా ఎట్ట‌కేల‌కు సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్నాడు .

ఈ విషయం అధికారికంగా కన్ఫమ్ కాగా, అందుకు సంబంధించిన అప్డేట్ కూడా వచ్చేసింది. అకిరా ఇప్పుడు ‘రైటర్స్ బ్లాక్‌’ అనే ఒక షార్ట్ ఫిల్మ్ కి మ్యూజిక్ డైరెక్టర్ గా చేస్తున్నాడు. ఈ షార్ట్ ఫిల్మ్ కి సంబంధించిన ఒక కాన్సెప్ట్ ఓరియంటెడ్ వీడియో రిలీజ్ చేయ‌గా, ఈ కాన్సెప్ట్ వీడియోకి సంబంధించి అకిరా అందించిన మ్యూజిక్ కచ్చితంగా వ్యూయ‌ర్స్ ని ఆకట్టుకునేలా క‌నిపిస్తుంది.

అకీరా మార్షల్ ఆర్ట్స్‌ తో పాటుగా.. మ్యూజిక్ కూడా నేర్చుకున్న విష‌యం తెలిసిందే. అయితే అకీరా సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్నాడు అనేది గుడ్ న్యూస్‌ అయినా.. మెగా అభిమానులకు ఇందులో ఒకింత బ్యాడ్ న్యూస్ అంటున్నారు. అందుకు కార‌ణం ఆయ‌న హీరోగా రావడం లేదు క‌దా అంటున్నారు.

మరిన్ని చదవండి :

Viral Video : మరువలేని మమకారం.. నెలరోజుల తర్వాత ఆరిఫ్‌ వెళ్తే జూలో కొంగ ఎంతలా పరితపించిందో చూడండి..

 

Exit mobile version