Telugu Flash News

Pawan Kalyan: ప‌వ‌న్ చిత్రంలో అకీరా గెస్ట్ రోల్‌.. ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ

pawan kalyan sujeeth new movie

Pawan Kalyan: ప‌వర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్ర‌స్తుతం సాహో ఫేమ్ సుజీత్ దర్శ‌క‌త్వ‌లో ఓజీ అనే సినిమా చేస్తున్న విష‌యం విదిత‌మే. ఈ సినిమాపై అంచ‌నాలు భారీగా ఉన్నాయి. మొదటి షెడ్యూల్ పూర్తి అయిన నేపథ్యం లో మేక‌ర్స్ ట్విట్టర్ లో విడుదల చేసిన ఒక ఫోటో సోషల్ మీడియా లో సెన్సేషన్ అయింది. మిగిలిన హీరోలకు ఫస్ట్ లుక్ విడుదలైనప్పుడు ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో ఓజీ మూవీ వర్కింగ్ స్టిల్ కే అంత‌టి రెస్పాన్స్ వచ్చింది. ఇక ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన రెండవ షెడ్యూల్ పూణే లో జరుగుతున్న‌ట్టు తెలుస్తుంది.

అయితే ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించి ఒక క్రేజీ అప్డేట్ సోషల్ మీడియా ని షేక్ చేస్తుంది. చిత్రంలో పవన్ కళ్యాణ్ 17 ఏళ్ళ వయస్సు లో ఉన్నప్పుడు ఎదురైన సంఘ‌ట‌ల‌ని షూట్ చేయ‌బోతున్నారు. అయితే ఈ పాత్ర కోసం పవన్ కళ్యాణ్ కొడుకు అకిరా నందన్ అయితే ఎలా ఉంటుంది అనే ఆలోచనలో ద‌ర్శ‌కుడు సుజీత్ అనుకుంటున్నాడ‌ట‌. పవన్ కళ్యాణ్ కెరీర్ లో ఈ చిత్రం భారీ బడ్జెట్ పాన్ ఇండియన్ యాక్షన్ చిత్రంగా రూపొందుతుంది కాబట్టి, ఇదే అకిరా నందన్ కి సరైన లాంచింగ్ అయ్యే సినిమా అని సుజీత్ కూడా అనుకుంటున్నాడ‌ట‌. దీనిపై చర్చ‌లు జ‌రుగుతుండగా, త్వ‌ర‌లోనే దీనిపై క్లారిటీ రానుంది.

also read :

IPL 2023 : కేఎల్‌ రాహుల్‌ ఔట్‌.. గాయంతో సీజన్‌ మొత్తానికి దూరం.. డబ్ల్యూటీసీలో ఆడగలడా?

Pakistan : పాకిస్తాన్‌లో దయనీయ పరిస్థితులు.. చుక్కలనంటిన ద్రవ్యోల్బణం

Exit mobile version