HomecinemaAkhil: బాబోయ్.. నైట్ పార్టీలో బాలీవుడ్ భామ‌ల‌తో ర‌చ్చ చేస్తున్న అఖిల్‌

Akhil: బాబోయ్.. నైట్ పార్టీలో బాలీవుడ్ భామ‌ల‌తో ర‌చ్చ చేస్తున్న అఖిల్‌

Telugu Flash News

Akhil: అక్కినేని మూడో త‌రం వార‌సుడు అఖిల్ ఈ రోజు ఏజెంట్ అనే చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాడు. ఈ సినిమాకి మిక్స‌డ్ టాక్ వ‌స్తుండ‌గా, ఆయ‌న బాలీవుడ్ భామ‌ల‌తో సంద‌డి చేసిన పిక్ ఒక‌టి నెట్టింట వైర‌ల్ అవుతుంది.

హీరోయిన్ ఊర్వశి రాతెలా త్రోబ్యాక్ పిక్ ఒకటి షేర్ చేయ‌గా, ఇందులో అఖిల్, ఊర్వశి రాతెలా, శ్రద్దా కపూర్ ఉన్నారు. ఒక నైట్ పార్టీలో వీరందరూ కలిసినట్లు ఆ ఫోటోని చూస్తే అర్ధ‌మ‌వుతుంది. ఏడేళ్ల క్రితం మేము ఇలా కలిశామంటూ ఊర్వ‌శి తన పోస్ట్‌కి కామెంట్ పెట్టింది.

ఈ పోస్ట్ చూసి చాలా కాలం క్రితం నుండే అఖిల్ బాలీవుడ్ ప్రైవేట్ పార్టీలు, ఫంక్షన్స్ లో పాల్గొనేవారని అభిమానులు ఆలోచ‌న‌లు చేస్తున్నారు. కాగా అఖిల్ లేటెస్ట్ మూవీ ఏజెంట్ లో ఊర్వశి రాతెలా ఆయనతో కలిసి చిందులేసింది.

వైల్డ్ సాలా అనే ఐటెం సాంగ్ లో ఊర్వ‌శి న‌టించ‌గా, ఈ పాట‌కి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. వాల్తేరు వీరయ్య మూవీలో ‘బాస్ పార్టీ’ అనే సాంగ్ లో కూడా ఆమె ఆడిపాడారు. నెక్స్ట్ రామ్ పోతినేని-బోయపాటి మూవీలోను ఊర్వశి కనిపించి సంద‌డి చేయ‌నుంది.

మరిన్ని వార్తల కోసం హోం పేజీ కి వెళ్ళండి | GO TO HOMEPAGE

Weather Today (28-04-2023) : తెలంగాణ, ఏపీలో ఈరోజు వాతావరణం ఎలా ఉంటుందంటే..

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News