Telugu Flash News

Akhil-RamCharan: రామ్ చ‌ర‌ణ్‌, అఖిల్ కాంబినేష‌న్‌లో మ‌ల్టీ స్టార‌ర్ రానుందా.. అస‌లు విష‌యం ఏంటంటే..!

akhil and ramcharan

Akhil-RamCharan: ఇటీవ‌ల మ‌ల్టీ స్టార‌ర్ చిత్రాలు ప్రేక్ష‌కుల ముందుకు ఎక్కువ‌గా వ‌స్తున్నాయి. ఆ చిత్రాలు అభిమానుల‌ని తెగ అల‌రిస్తున్నాయి కూడా. అయితే ఇప్పుడు రామ్ చ‌ర‌ణ్‌, అఖిల్ కాంబినేష‌న్‌లో ఓ సినిమా రానుంద‌నే చ‌ర్చ న‌డుస్తుంది. ఈ క్ర‌మంలో ఏజెంట్ మూవీ ప్రెస్ మీట్ లో అఖిల్ మాట్లాడుతూ .. ‘ఏజెంట్’ యాక్షన్ మూవీ అయినప్పటికీ, దాని వెనుక బలమైన ఎమోషన్స్ ఉంటాయి అని చెప్పాడు. ఈసినిమాలో.. కొత్తగా కనిపించి ఆడియన్స్ మెప్పు పొందుతాన‌ని అఖిల్ అన్నారు.

ఇక మల్టీ స్టారర్ సినిమాల గురించి, తన ఫ్యామిలీ హీరోల‌తో నటించే విషయం గురించి కూడా ఇంట్రెస్ట్ కామెంట్స్ చేశారు అఖిల్. ఫ్యామిలీతో కలిసి నటించే విషయాన్ని గురించి మాట్లాడిన అఖిల్.. మనం సినిమా లాంటి స్క్రిప్టులు తరచుగా చేయడం అసాధ్యం. కావాలని చెప్పేసి అలాంటి ప్రయత్నాలు చేస్తే కాంబినేషన్ కి ఉన్న విలువ పోతుంది అని పేర్కొన్నాడు అఖిల్.

ఇక నేను మా అన్నయ్య కలిసి నటించడానికి అవకాశం ఉన్న కథ ఇంతవరకూ దొరకలేదు. అది దొరికితే త‌ప్ప‌క చేస్తాన‌ని అన్నాడు.ఇక రామ్ చరణ్ తో మ‌ల్టీ స్టార‌ర్ చేయడానికి ఎక్కువగా ఇష్టపడతాను అని చెప్పిన అఖిల్. రామ్ చరణ్ తో కథ దొరికితే సినిమా చేసి తీరుతాన‌ని చెప్పి ఫ్యాన్స్‌కి అదిరిపోయే న్యూస్ చెప్పాడు.

heatwave : దేశ వ్యాప్తంగా మండుతున్న ఎండలు.. కేంబ్రిడ్జ్‌ వర్సిటీ కీలక నివేదిక!

Exit mobile version