HomecinemaAkhil: ఫ్యామిలీ అన్నాక గొడ‌వ‌లు రావా అంటూ అఖిల్ కామెంట్స్.. ఎందుకిలా అన్నాడు..!

Akhil: ఫ్యామిలీ అన్నాక గొడ‌వ‌లు రావా అంటూ అఖిల్ కామెంట్స్.. ఎందుకిలా అన్నాడు..!

Telugu Flash News

Akhil:  కుటుంబం, బంధాలు అన్నాక గొడవలు పడరా.. తిట్టుకోరా అంటూ అక్కినేని అఖిల్‌ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చ‌ర్చనీయాంశంగా మారాయి. తాను న‌టించిన ఏజెంట్ చిత్ర ప్రమోష‌న్‌లో భాగంగా అఖిల్ మాట్లాడుతూ.. దర్శకుడు సురేంద‌ర్ రెడ్డికి కోపం వ‌చ్చి షూటింగ్ ఆగిపోయింద‌ని, సెట్స్ నుంచి వెళ్లిపోయాడు.. వంటి వార్తలు చాలా రాసుకొచ్చారు అయితే మేం అదే రోజు ఈ షాట్ ఇరగదీశం అని అనుకునే స‌మ‌యంలో ఇలాంటి వార్త‌లు చూసి న‌వ్వుకునే వాళ్లం.

ఏజెంట్ సినిమా షూటింగ్ రెండేళ్ల పాటు జ‌రిగింది. ఈ రెండు సంవత్సరాల ప్ర‌యాణంలో టీమ్‌లో కొంత ఒత్తిడి ఉండ‌దంటారా. మ‌న ఫ్యామిలీ అన్నాక గొడ‌వ‌లు రావా.. కుటుంబ స‌భ్యులు ఒక‌రినొక‌రు తిట్టుకోరా.. అలాగే మా టీమ్‌లోనూ కొన్ని జ‌రిగాయి. తిట్టుకోవ‌టం అంటే మ‌రీ తిట్టుకోవ‌టం కాదు.. ఇంత‌కు ముందు చెప్పిన‌ట్లు కాస్త‌ స్ట్రెస్ ఉండింది.

అయితే ఈ జ‌ర్నీని మేం ప్ర‌తీ క్ష‌ణం ఎంజాయ్ చేశాం అని అఖిల్ అన్నారు. ఇక ఏడాది స‌మ‌యం క‌రోనాతో వేస్ట్ అయిపోయింది అని ద‌ర్శ‌కుడు సురేంద‌ర్ రెడ్డి అన్నారు బుడాపెస్ట్‌లో షూటింగ్ చేస్తున్న‌ప్పుడు నాకు క‌రోనా రాగా, 20 రోజులు నేను వెంటిలేట‌ర్‌పైనే ఉన్నాను. ఈ విష‌యాలు ఎవ‌రికీ తెలియ‌వు. న‌న్ను టీమ్ ఎలా కాపాడుకుని ఇక్క‌డ‌కు తీసుకొచ్చిందో మాకు తెలుసు అంటూ ఎమోష‌న‌ల్ అయ్యారు సురేంద‌ర్ రెడ్డి.

also read news :

Horoscope (17-04-2023) : ఈ రోజు రాశి ఫ‌లాలు ఎలా ఉన్నాయంటే?

భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. త్వరపడండి!

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News