Agent: అఖిల్ అక్కినేని నటించిన ఏజెంట్ చిత్రం ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చి ఆడియన్స్ నుండి మిశ్రమ స్పందన అందుకుంటుంది. సినిమాలో యాక్షన్ సీన్స్ బాగున్నాయని, అఖిల్ మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాడని చెబుతున్నారు.
అయితే ఏజెంట్ సినిమా విషయంలో పెద్ద కుట్ర జరిగిందని ప్రముఖ నిర్మాత నట్టి కుమార్ సంచలన ఆరోపణలు చేశారు. అక్కినేని హీరో అఖిల్‌ను కావాలని తొక్కిపడేశారంటూ కామెంట్స్ చేయడం హాట్ టాపిక్ అయింది..
‘ఏజెంట్’ చిత్రం వెనుక జరిగిన కుట్రలో బడా ప్రొడ్యూసర్ దిల్ రాజు, శిరీష్లది ప్రధాన పాత్ర వహించారని నట్టి అన్నారు. అక్కినేని ఫ్యామిలీ హీరోను తొక్కడానికి దిల్ రాజు ‘పొన్నియిన్ సెల్వన్-2’ సినిమాను ఈ డేట్‌కి షిఫ్ట్ చేశారు.
తెలుగు చిత్రానికి కాకుండా తమిళ మూవీకి ప్రయారిటీ ఇచ్చారని ఆయన అన్నారు. ఏజెంట్’ చిత్రాన్ని తొలుత ఏషియన్ సునీల్ కొన్నారని.. కానీ దిల్ రాజు, శిరీష్ రంగంలోకి దిగి, ఆ చిత్రాన్ని ఎవర్నీ కొనొద్దని చెప్పారంటూ నట్టి ఆరోపణలు చేశారు.
ఒకవేళ ఆ చిత్రాన్ని కొన్నా కూడా థియేటర్లు ఇవ్వొద్దని బెదిరించారని నట్టి తాజా ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు. ఇంత జరుగుతున్నా కూడా నాగార్జున ఏం చేస్తున్నారని నట్టి కుమార్ గట్టిగా మాట్లాడారు.
also read :
Agent Telugu Movie Review : ‘ఏజెంట్’ తెలుగు మూవీ రివ్యూ
Akhil: బాబోయ్.. నైట్ పార్టీలో బాలీవుడ్ భామలతో రచ్చ చేస్తున్న అఖిల్