Ajith – Shalini : కోలీవుడ్ క్యూట్ కపుల్స్‌లో అజిత్, షాలిని జంట ఒకటి. ఈ జంట ఎంతో చూడ ముచ్చటగా ఉంటూ అందరి దృష్టిని ఆకర్షిస్తూ ఉంటుంది. 1999లో అమర్కలం సినిమా షూటింగ్ సమయంలో వీరిద్దరి మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమగా మారి 2000 ఏప్రిల్ 24న వివాహ బంధంతో ఒకటయ్యారు. వీరికి ఇద్దరు పిల్లలు ఉండగా.. పెళ్లి తర్వాత షాలిని పూర్తిగా ఇండస్ట్రీకి దూరంగా ఉంటూ వస్తుంది. అయితే అప్పట్లో షాలినిని పెళ్లి చేసుకోవద్దని అజిత్‌ను పదే పదే హెచ్చరించాడట డైరెక్టర్ రమేశ్ ఖన్నా.
అజిత్, షాలిని ప్రేమలో ఉన్న విషయం తెలియని రమేష్ ఖన్నా, మీ గురించే అందరు మాట్లాడుకుంటున్నారు. షాలినికి దూరంగా ఉండండి అని చెప్పాడట. అయితే మరో డైరెక్టర్ శరణ్.. హీరోకే వార్నింగ్ ఇస్తున్నావు.. తర్వాత పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని హెచ్చరికలు జారీ చేశశాడట.
అయితే ప్రేమలో ఉన్నారని తెలియక తాను అలా మాట్లాడానని, వారి వివాహానికి తాను హజరయ్యానని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో స్పష్టం చేశాడు రమేష్. కాగా, అమర్కలం అనే సినిమా విడుదలైన మరుసటి ఏడాది వీరు పెళ్లి బంధంతో ఒక్కటయి ఇప్పటి వరకు ఎంతో అన్యోన్యంగా ఉంటూ నలుగురికి ఆదర్శంగా నిలుస్తున్నారు.
also read :
Satvik Suicide Case : సాత్విక్ ఆత్మహత్య కేసులో సంచలన విషయాలు!
Kiara Advani Latest Photos at WPL Opening Ceremony 2023, Videos