Ajinkya Rahane : వన్డే, క్రికెట్, టీ20లో అద్భుతంగా రాణించి మంచి పేరు తెచ్చుకున్న క్రీడాకారుడు అజింక్యా రహానే. ఇటీవల క్రికెట్ కాస్త తగ్గించిన రహానే.. తాజాగా తండ్రి ప్రమోషన్ అందుకున్నాడు. రహానే భార్య రాధిక పండంటి మగబిడ్డకి జన్మనివ్వగా, ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా అజింక్య రహానె స్వయంగా వెల్లడించి ఫ్యాన్స్‌కి క్రేజీ న్యూస్ చెప్పాడు. 2014, సెప్టెంబరు 26న రాధికాని అజింక్య రహనె వివాహం చేసుకోగా, ఈ దంపతులకి 2019, అక్టోబరులో ఓ పాప జన్మించింది. ఆ పాపకి ఆర్య అని నామకరణం చేశారు. అయితే నిన్న ఉదయం రాధిక మగబిడ్డకు జన్మనిచ్చిందని, తల్లి బిడ్డ పూర్తి క్షేమంగా ఉన్నారని సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు.
— Ajinkya Rahane (@ajinkyarahane88) October 5, 2022
ఖుషీ ఖుషీ..
రహానెకి భారత మాజీ క్రికెటర్లతో పాటు ప్రస్తుత క్రికెటర్స్ రాబిన్ ఉతప్ప, చతేశ్వర్ పుజారా, ప్రగ్యాన్ ఓజా తదితరులు విషెస్ తెలిపారు. అభిమానులు సైతం శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇక ప్రస్తుతం రహనే ..దులీప్ ట్రోఫీ ఆడుతున్నాడు. రహానే కెప్టెన్సీలో ఈ ట్రోఫీ దక్కించుకున్ననారు. ఆ ట్రోఫీలో అజింక్య రహానె ఐదు ఇన్నింగ్స్‌ల్లో 250 పరుగులు చేయగా, ఇందులో ఒక డబుల్ సెంచరీ కూడా ఉండడం విశేషం. అలానే అతను సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలోనూ ముంబయి జట్టుని కెప్టెన్‌గా నడిపించబోతున్నాడు.
దులీప్ ట్రోఫీ ఫైనల్ లో మితిమీరిన స్లెడ్జింగ్‌తో వార్తల్లో నిలిచిన వెస్ట్‌జోన్ ప్లేయర్ యశస్వి జైస్వాల్ ప్రవర్తనపై ఆందోళన వ్యక్తం చేసిన కెప్టెన్ ఆజింక్య రహానే.. ఏకంగా జైస్వాల్‌ను ఫీల్డ్ నుంచి బయటకు వెళ్లమని ఆదేశించాడు. దీంతో జైస్వాల్ ఏడు ఓవర్ల వరకు మైదానం వీడగా, ఈ విషయం చర్చనీయాంశంగా మారింది. స్లెడ్జింగ్ శ్రుతిమించుతోందని రవితేజ ఫిర్యాదు చేయడంతో రహానే ఇలా చర్యలు తీసుకున్నాడని అంటున్నారు.. జైస్వాల్ స్లెడ్జింగ్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతుంది.