HomesportsAjinkya Rahane : టెస్టులకు కూడా పనికిరాడన్నారు.. ఇప్పుడు సిక్సర్ల సునామీ సృష్టిస్తున్నాడు!

Ajinkya Rahane : టెస్టులకు కూడా పనికిరాడన్నారు.. ఇప్పుడు సిక్సర్ల సునామీ సృష్టిస్తున్నాడు!

Telugu Flash News

Ajinkya Rahane : ఒకప్పుడు వన్డేల్లో రాణించిన క్రికెటర్‌.. తర్వాత టీమిండియా నుంచి తన స్థానాన్ని కోల్పోయాడు. టెస్టుల్లో తప్పనిసరిగా అతడి పేరు ఉండాల్సిందే. అంతలా తన మార్క్‌ ఆటతో ఆకట్టుకున్న అతడు.. ప్రస్తుతం ఫామ్‌ కోల్పోయి.. వన్డేలు, టీ20లతో పాటు టెస్టుల్లోనూ జట్టుకు దూరమయ్యాడు.

ఇక అతడి పని అయిపోయిందని చాలా మంది అనుకున్నారు. ఆఖరికి ఐపీఎల్‌లో కూడా అతడికి ఏ ఫ్రాంచైజీ తీసుకోడానికి ఆసక్తి చూపలేదు. ఇక మిగిలింది రిటైర్‌మెంట్‌ ప్రకటించడమే..! అయితే, అనూహ్యంగా ఇప్పుడు 2.0 చూపిస్తున్నాడు టీమిండియా వెటరన్‌ క్రికెటర్‌. అతడే అజింక్యా రహానె.

టీమిండియా ఏ దేశంలో పర్యటించినా టెస్టుల్లో భారత్‌ కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకున్న చరిత్ర అజింక్యా రహానె సొంతం. టెస్టుల్లో 12 సెంచరీలు చేసిన రహానె.. తర్వాత తన ఫామ్‌ లేమితో తీవ్రంగా ఇబ్బంది పడ్డాడు. జట్టుకు దూరమై.. ఐపీఎల్‌లోనూ నిరాశ ఎదురైంది.

ఈ క్రమంలో అతడిపై నమ్మకం ఉంచిన చెన్నై సూపర్‌ కింగ్స్‌ యాజమాన్యం.. వేలంలో కనీస ధర రూ.50 లక్షలకు రహానెను సొంతం చేసుకుంది. మొదటి మ్యాచ్‌లో ప్లేయింగ్‌ 11లో చోటు దక్కించుకోలేకపోయాడు. బెంచ్‌కే పరిమితం అవుతాడని అందరూ భావించారు.

అనూహ్యంగా సీఎస్కే తుది జట్టులో చోటు దక్కించుకున్న రహానె.. అప్పటి నుంచి తన శైలికి భిన్నంగా ఆడటం మొదలు పెట్టాడు. అంతెందుకు నెల ముందు వరకు అజింక్యా రహానె అనే క్రికెటర్‌ ఒకడు ఉన్నాడనే విషయం కూడా చాలా మంది అభిమానులు మరిచిపోయారు.

గత సీజన్లో కోల్‌కతా నైట్‌ రైడర్స్‌కు ఆడిన రహానె.. పెద్దగా రాణించలేకపోయాడు. ఈసారి మాత్రం భిన్నమైన రహానెను చూస్తున్నారు అభిమానులు. ముంబైతో జరిగిన మ్యాచ్‌లో 27 బంతుల్లోనే 61 పరుగులు చేసి ఔరా అనిపించాడు.

-Advertisement-

ఇక రాజస్తాన్‌ రాయల్స్‌పై జరిగన మ్యాచ్‌లో 19 బంతుల్లోనే 31 పరుగులు చేశాడు. ఆర్సీబీపై కూడా 20 బంతుల్లోనే 37 పరుగులతో రాణించాడు. ఇక తాజాగా ఆదివారం కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో చెలరేగిపోయిన రహానె.. బౌలర్ల భరతం పట్టాడు. కేవలం 29 బంతులే ఎదుర్కొన్న రహానె.. 71 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.

బలం కన్నా టైమింగ్‌ ఉపయోగించి అతడు బాదిన సిక్సర్లు సీఎస్కే అభిమానులకు వీనులవిందు చేశాయి. ఈ తరం టీ20 ఆటగాళ్ల కంటే ఏ మాత్రం తీసిపోకుండా రహానె 2.0ను పరిచయం చేస్తూ విధ్వంసకర ఇన్నింగ్స్‌ ఆడుతున్నాడు. మొత్తంగా 5 మ్యాచ్‌లు ఆడిన రహానె.. 199 స్ట్రైక్‌ రేట్‌తో 209 పరుగులు చేశాడు. ఇకపై ఇంకెన్ని భారీ ఇన్నింగ్స్‌ ఆడతాడో అని ఫ్యాన్స్‌ ఎదురు చూస్తున్నారు.

also read :

Nagarjuna | అఖిల్.. వాళ్ల అమ్మ‌ని చాలా ఇబ్బంది పెట్టాడు : నాగార్జున‌

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News