గత ఏడాది తమిళ నటుడు ధనుష్, ఐశ్వర్య రజనీకాంత్ విడిపోతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. తమ 18 ఏళ్ల వైవాహిక జీవితానికి ముగింపు పలుకుతున్నట్లు ఇద్దరూ సోషల్ మీడియాలో ప్రకటించారు. అయితే కొన్ని రోజుల క్రితం విడాకులు రద్దవుతున్నట్లు అనేక వార్తలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేసిన సంగతి తెలిసిందే. ఈ వార్తలపై ధనుష్, ఐశ్వర్య ఇద్దరూ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. దీంతో వీరిద్దరూ మళ్లీ కలవడం అసాధ్యమని అభిమానులు ఆందోళన చెందుతున్నారు.
తాజాగా ఐశ్వర్య రజనీకాంత్ రెండో పెళ్లి చేసుకోనుందని ఓ వార్త వైరల్ అవుతుంది. ప్రస్తుతం ఆమె ఇద్దరు పిల్లలతో ఒంటరి తల్లిగా ఉంటున్నారు. అంతే కాకుండా ఓ సినిమాకు కూడా దర్శకత్వం వహిస్తున్నారు. ఐశ్వర్య ఇటీవల ఓ కోలీవుడ్ హీరోతో కనిపించడమే ఇలాంటి పుకార్లకు ప్రధాన కారణం. చెన్నైలోని ఓ రిసార్ట్‌లో ఆమె అతనితో సన్నిహితంగా ఉండటంతో ఈ రెండో పెళ్లిపై పుకార్లు బలంగా వ్యాపించాయి.
ప్రస్తుతం ఐశ్వర్య , రజినీకాంత్ నటిస్తున్న లాల్ సలామ్ సినిమా తో బిజీ గా ఉన్నారు. ఇండియా టుడే కి ఆమె ఇచ్చిన ఒక ప్రత్యేక ఇంటర్వ్యూ లో ఈ విషయం గురించి ఆమెను అడిగినప్పుడు ” ఇవన్నీ కట్టు కథలు. ఇవన్నీ అవాస్తవలే. నేను రెండో పెళ్లి చేసుకోవడం లేదు. ” అని తెలిపారు.
ఎందుకు విడిపోయారు? కారణం ఇదేనా? కారణం ఇంకా పూర్తిగా తెలియలేదు. ముందుగా ఐశ్వర్య విడిపోతున్నట్లు ప్రకటించి, ఆ తర్వాత ధనుష్ ప్రకటించాడు. దీంతో అందరూ ఆశ్చర్యపోయారు. అయితే సుచీ లీక్స్‌లో ధనుష్ ఫోటోలు బయటకు వచ్చిన రోజు నుంచే వీరి మధ్య పోరు మొదలైందనే ప్రచారం జరుగుతోంది. ఆ తర్వాత ధనుష్ ఓ హీరోయిన్ తో ప్రేమాయణం సాగించడం ఐశ్వర్యకు నచ్చలేదని, అందుకే ఐశ్వర్య విడాకులకు సిద్ధమైందనే టాక్ వినిపిస్తోంది. తమిళ సినీ వర్గాల సమాచారం ప్రకారం, కోలీవుడ్‌లో ధనుష్ వ్యవహారంతో ఐశ్వర్య చాలా కాలంగా బాధపడుతోంది.
also read :
మహేశ్ బాబు సినిమా తరువాతే ‘మహాభారతం’.. విజయేంద్ర ప్రసాద్ ఆసక్తికర వ్యాఖ్యలు
Janhvi Kapoor Looks Gorgeous In Green Saree With Blue Blouse, See Sexy Stills