Telugu Flash News

Air India : విమాన టికెట్ల ధరలు భారీగా పెరుగుతున్న వేళ సంచలన ఆఫర్.. అతి తక్కువ ధరకే జర్నీ చేయండిలా..!

air india flight ticket rate offers

Air India : ప్రపంచ వ్యాప్తంగా కరోనా పాండెమిక్‌ పరిస్థితుల తర్వాత విమాన ప్రయాణంలో విపరీతమైన మార్పులు సంభవించాయి. విమాన ప్రయాణాల్లో నిబంధనలు పెరిగాయి. దాంతోపాటు విమాన ప్రయాణ టికెట్ల ధరలు అమాంతం పెరిగిపోయాయి. అంతకుముందు సామాన్యుడు కూడా విమానాల్లో ప్రయాణాలు చేసేలా కాస్త మధ్య స్థాయిలో విమాన ప్రయాణాల టికెట్ల ధరలు ఉండేవి. ఇప్పుడు ఆకాశంలో ప్రయాణం కాబట్టి టికెట్ల రేట్లు కూడా ఆకాశాన్నంటేలా చేశాయి విమానయాన సంస్థలు.

అయితే, ఈ తరుణంలో కాస్త డిస్కౌంట్లలో విమాన ప్రయాణం లభిస్తే జర్నీ చేద్దాం అని చాలామంది ఎదురు చూస్తుంటారు. ఇలాంటి వారికి టాటాల యాజమాన్యంలో నడుస్తున్న ఎయిర్‌ ఇండియా గుడ్‌ న్యూస్‌ చెప్పింది. తమ ప్రయాణాలను ముందుగా ప్లాన్‌ చేసుకొనే వారి కోసం ప్రత్యేక ఆఫర్లు తీసుకొస్తోంది ఎయిర్‌ ఇండియా. ఇటీవల బిజినెస్‌లో కాస్త ఊపు అందుకోవాలని ప్రయత్నిస్తున్న ఎయిర్‌ ఇండియా.. తాజాగా డిస్కౌంట్లను ప్రవేశపెట్టింది.

FLYAI SALE పేరిట ఎయిర్‌ ఇండియా సరికొత్త ఆఫర్‌ను ప్రవేశపెట్టింది. ఇందులో భాగంగా రాయితీపై విమాన టికెట్లను అందుబాటులోకి తెచ్చింది. ఈ ఏడాది ఫిబ్రవరి 1 నుంచి సెప్టెంబర్‌ 30వ తేదీ మధ్య దేశీయంగా ప్రయాణాలు చేయాలనుకొనే వారికి ఈ ఆఫర్‌ వర్తింస్తుందని వెల్లడించింది. అయితే, ఇందులో పరిమిత సంఖ్యలో మాత్రమే టికెట్లు ఉంటాయని ఎయిర్‌ ఇండియా వెల్లడించింది. మరి ఆలస్యం ఎందుకు వెంటనే టికెట్లు బుక్‌ చేసుకోవాలని సూచించింది.

23వ తేదీలోపు బుక్‌ చేసుకోవాలి..

ఈనెల 23లోపు బుకింగ్‌ చేసుకోవాలని ఎయిర్‌ ఇండియా సూచించింది. ఆఫర్‌ ప్రకారం వన్‌వే టికెట్‌ ధర కేవలం రూ.1,705 నుంచే ప్రారంభం అవుతుంది. దేశ వ్యాప్తంగా 49 గమ్యస్థానాలకు ఈ ఆఫర్‌ వర్తిస్తుంది. ఎయిర్‌ ఇండియా సంస్థ టాటా గ్రూప్‌ చేతికి వచ్చిన తర్వాత వేగంగా అభివృద్ధి చెందాలని ప్రయత్నాలు ప్రారంభించింది. కంపెనీ భారీగా కొత్త జెట్‌ ఫ్లైట్‌లను కూడా కొనుగోలు చేసేందుకు ఆర్డర్లు కూడా చేసినట్లు తెలుస్తోంది. సేవలను కూడా మెరుగుపరుచుకొనేందుకు గణనీయమైన మార్పులకు శ్రీకారం చుట్టింది ఎయిర్‌ ఇండియా.

also read :

Viral Video Today : నిప్పుతో ఆటలాడుదామని చూశాడు.. చివరకు ఏమైందో మీరే చూడండి!

Janasena in Rayalaseema : సీమలో జనసేన బలం పెరిగిందా? కర్నూలులో అపూర్వ స్పందనే ఇందుకు సంకేతమా?

పై చదువుల కోసం అమెరికా వెళ్లే వారిలో హైదరాబాదీ స్టూడెంట్లదే హవా.. ఎంత మంది వెళ్తున్నారంటే..!

Exit mobile version