Telugu Flash News

Africa splitting : ఆఫ్రికా రెండు ముక్కలవుతుందా? కొత్త ఖండం ఆవిర్భావం ఖాయమా?

Africa split into Two Continents

Africa split into Two Continents

Is Africa splitting into two continents : పురాణ శాస్త్రాల ప్రకారం ఒకప్పుడు భూమి అంతా ఒకటే ఖండంగా ఉండేదని చెబుతారు. అయితే, కాలక్రమేణా సంభవించిన మార్పుల కారణంగా పలు ఖండాలుగా వ్యాప్తి చెందిందని పేర్కొంటారు. అలా ఏర్పడినవిఏ ఆసియా, ఆఫ్రికా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, అంటార్కిటికా, యూరప్‌, ఆస్ట్రేలియా.. ఇలా ఏడు ఖండాలు. ఈ మేరకు ఖగోళ శాస్త్రవేత్తలు సైతం చెబుతున్నారు.

ప్రస్తుతం భూమిలో వస్తున్న మార్పుల కారణంగా ఎనిమిదో ఖండం పుట్టుక సంభవిస్తోందని శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తున్నారు. ఇక ప్రపంచ పటంలో ఖండాలు ఏడు కాదు.. ఎనిమిది అని అందరం చదువుకోవాల్సి ఉంటుంది.

అయితే, ఇవన్నీ ఊహాగానాలు మాత్రమే కాదని, నిజమంటూ సంకేతాలు వస్తున్నాయి. చీకటి ఖండంగా పేరుగాంచిన ఆఫ్రికా.. ప్రస్తుతం రెండు ముక్కలు కానుందని సమాచారం. దీని నుంచే మనం ఊహించే ఎనిమిదో ఖండం రాబోతోందని భోగట్టా. ఇలా ఆఫ్రికా రెండుగా చీలే క్రమంలో వీటి మధ్య మహాసముద్రం  ఏర్పడనుందని సంకేతాలు వెలువడుతున్నాయి.

దీనికి సంబంధించి భూమి లోపల, భూమి పైన కూడా ఇండికేషన్లు మొదలయ్యాయని శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తున్నారు. ఎనిమిదో ఖండం ఏర్పడటం అనేది ఇప్పటికిప్పుడే జరగకున్నా.. కొన్ని వేల సంవత్సరాల్లో ఇది తథ్యంగా జరుగుతుందని, ఖండాల మధ్య సముద్రం వస్తుందని భూగర్భ నిపుణులు తేల్చి చెబుతున్నారు.

ఇక భూమిపై నిరంతరం మార్పులు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. అయితే, కాలానుగుణంగా సంభవించే మార్పులు వెంటనే కనిపించవు. మార్పులు కనిపించాలంటే వేలాది ఏళ్లు పడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి పెనుమార్పులకు ఆఫ్రికా ఖండం వేదికగా మారుతోందని చెబుతున్నారు. ఈ మార్పును తూర్పు ఆఫ్రికా చీలికగా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. టెక్టానిక్‌ ప్లేట్‌ రెండుగా విడిపోవడాన్నే సైంటిస్టులు ఈ చీలికగా అభివర్ణిస్తున్నారు.

భూగర్భంలో పలకలు మూవింగ్‌ మొదలైనప్పుడు లోయలాంటి పగుళ్లు భూమి పైభాగంలో, భూగర్భంలోనూ ఏర్పడతాయని చెబుతున్నారు. సుమారు 138 మిలియన్‌ ఏళ్ల క్రితం ఇలాంటి పరిణామమే ఏర్పడి సౌతాఫ్రికా, ఆఫ్రికా రెండు ఖండాలుగా విడిపోయినట్లు గుర్తు చేస్తున్నారు. ప్రస్తుతం ఆఫ్రికాలోనూ ఇలాంటి మార్పులు స్పష్టంగా కనిపిస్తున్నాయంటున్నారు.

గడచిన 30 మిలియన్‌ సంవత్సరాలుగా అరేబియన్ ప్లేట్‌ ఆఫ్రికా నుంచి దూరంగా వెళ్తున్నట్లు గుర్తించారు. ఈ ప్రక్రియ ఫలితంగా రెడ్‌ సముద్రం, ఏడెన్‌ గల్ఫ్‌ ఏర్పడ్డాయి. అయితే, 2005లో ఇథియోపియో ఎడారిలో 56 కిలోమీటర్ల పొడవున భారీ పగుళ్లు ఏర్పడ్డాయి. ఇలాంటి ఘటనలు చాలా జరిగాయని శాస్త్రవేత్తలు గుర్తు చేస్తున్నారు. కొత్త ఖండాల ఏర్పాటు మధ్యలో సముద్రం ఏర్పడుతుందని చెబుతున్నారు.

also read :

Meena: ఆ హీరో అంటే క్ర‌ష్ అన్న మీనా.. ఆయ‌న పెళ్లి రోజు గుండె బ‌ద్ద‌లైందంటూ కామెంట్

అదానీ ఇంట్లో పెళ్లి సందడి.. కుమారుడు జీత్ అదానీ నిశ్చితార్థం.. కోడలు ఎవరంటే..

Exit mobile version