Homecinemabollywood : ప్రకృతి అందాలను ఆస్వాదిస్తున్న ఆదిత్య, అనన్య పాండే.. ఫోటోలు హల్ చల్

bollywood : ప్రకృతి అందాలను ఆస్వాదిస్తున్న ఆదిత్య, అనన్య పాండే.. ఫోటోలు హల్ చల్

Telugu Flash News

bollywood : బాలీవుడ్ అయినా, టాలీవుడ్ అయినా, కలిసి నటించినా, కలిసి నటించకపోయినా.. నటీనటులు ఏదో ఒక సమయంలో ప్రేమలో పడతారు. అయితే తమ ప్రేమ విషయాన్ని మీడియాకు చిక్కకుండా గోప్యంగా ఉంచుతున్నారు.

అయితే కొన్ని సందర్భాల్లో మీడియాకు రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోతుంటారు. తాజాగా అలాంటి ప్రేమ జంట మీడియా కంట పడింది. ఎన్నో ఏళ్లుగా బాలీవుడ్‌లో ప్రేమాయణం సాగిస్తున్న బాలీవుడ్ లవర్ బాయ్ ఆదిత్య రాయ్ కపూర్, అనన్య పాండేల ప్రేమ వ్యవహారం బయటకు వచ్చింది. వీరిద్దరి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

ఆదిత్య రాయ్ కపూర్, అనన్య పాండే స్పెయిన్‌లో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరయ్యారు. అక్కడ అందమైన లొకేషన్లను ఎంజాయ్ చేస్తున్నారు. వంతెనపై నడుస్తూ ప్రకృతి అందాలను ఆస్వాదిస్తున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. అయితే వీరిద్దరూ సన్నిహితంగా ఉన్నట్టు ఈ ఫొటోల్లో కనిపిస్తోంది. ఒక స్టిల్ లో అనన్య ని గట్టిగా కౌగిలించుకున్నాడు ఆదిత్య. బాలీవుడ్‌లో ఇదో కొత్త ప్రేమ జంట అని అభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు.

aditya roy kapoor and ananya panday in spain
aditya roy kapoor and ananya panday in spain

ఆదిత్య రాయ్ కపూర్, అనన్య పాండే ప్రేమలో ఉన్నారని ఇప్పటికే వార్తలు వచ్చాయి. వారిద్దరూ స్పందించలేదు. ఖండించలేదు. దీనికి తోడు తనకు ఆదిత్య అంటే ఇష్టమని…అతని లుక్స్ బాగున్నాయని అనన్య చాలా సార్లు చెప్పింది. అంతే కాకుండా కలిసి చాలా పార్టీలకు వెళ్లి దగ్గరుండి మాట్లాడుకోవడంతో వీరిద్దరూ రిలేషన్ షిప్ లో ఉన్నారని పుకార్లు వచ్చాయి. అయితే తాజాగా లీకైన ఫోటోలతో వాటన్నింటికీ బలం చేకూరింది.

ఆషికీ 2 తో సూపర్ క్రేజ్ సంపాదించుకున్న ఆదిత్య రాయ్ కపూర్… ఆ తర్వాత ఓకే జాను, డియర్ జిందగీ, రాష్ట్ర కవచ్ ఓం వంటి చిత్రాల్లో నటించాడు. ప్రస్తుతం డినోలో మెట్రో చిత్రంలో నటిస్తున్నాడు. స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2 సినిమాతో తెరంగేట్రం చేసిన అనన్యపాండే 2022లో లైగర్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఊహించని ఫ్లాప్ అయ్యింది. ప్రస్తుతం రాకీ ఔర్ రాణి ప్రేమ్ కహానీ, డ్రీమ్ గర్ల్ 2, కంట్రోల్ వంటి చిత్రాల్లో నటిస్తోంది.

also read :

-Advertisement-

Mokshagna : నందమూరి అభిమానులకు బ్యాడ్ న్యూస్! ఇప్పట్లో మోక్షజ్ఞ ఎంట్రీ లేనట్టే..

Sadha : అందాల భామ సదా ఎందుకు పెళ్లి చేసుకోలేదో తెలుసా ?

 

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News