Adipurush : ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘ఆదిపురుష్’ థియేటర్లలోకి వచ్చింది. రాముడి గా రెబెల్ స్టార్ ప్రభాస్, సీతగా కృతిసనన్ నటించిన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా 9000 స్క్రీన్లలో విడుదలైంది.
తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా ‘ఆదిపురుషుడు’ కనిపిస్తున్నాడు. ఇప్పటికే పలు చోట్ల ఫస్ట్ డే ఫస్ట్ షో రిలీజ్ అయ్యింది. టీజర్ విడుదల సందర్భంగా సినిమాపై కొన్ని విమర్శలు వచ్చినా.. ఆ తర్వాత విడుదలైన ట్రైలర్స్ మాత్రం ఆ విమర్శలకు ధీటైన సమాధానం ఇచ్చింది.
ఈ రోజు విడుదల అయిన ఈ సినిమా భారీ విజయం సాదిస్తుందని అభిమానులు అంటున్నారు. జై శ్రీరామ్ నినాదాలు చేస్తూ అభిమానులు థియేటర్ల దగ్గర బారులు తీరుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లోని ప్రభాస్ అభిమానులు అర్ధరాత్రి నుంచి టపాసులు కాలుస్తూ, డప్పులు వాయిస్తూ సందడి చేస్తున్నారు.
తెల్లవారుజామున నాలుగు గంటలకే ఆదిపురుష బెనిఫిట్ షోలు ప్రారంభం కావడంతో.. ప్రభాస్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడని సినిమా చూసిన అభిమానులు అంటున్నారు.
ఇదిలా ఉంటే థియేటర్ల వద్ద రివ్యూలు ఇచ్చేవారికి ప్రభాస్ ఫ్యాన్స్ సీరియస్ వార్నింగ్ ఇస్తున్నారు. ఇటీవల ఏదైనా సినిమా విడుదలైతే ఆ సినిమాకు సంబంధించిన గెటప్‌లు వేసుకుని మరీ రివ్యూలు ఇవ్వడం చూస్తూనే ఉన్నాం.వీళ్ల చేష్టలను చూస్తూ ఊరుకోవద్దని అభిమానులు హెచ్చరిస్తున్నారు.
అవతార్ 2 సినిమా విడుదల సందర్భంగా కొందరు ఆ గెటప్‌లు వేసి హంగామా సృష్టించారు. ఇక ఇప్పుడు ఆదిపురుష్ రివ్యూలు హనుమంతుడు, రాముడు గెటప్‌లో వస్తారని, పిచ్చి కాస్ట్యూమ్స్ వేసుకోవద్దని అభిమానులు హెచ్చరిస్తున్నారు.
లైక్స్, కామెంట్స్ కోసం అభిమానులు ఇలాంటి పనులు చేయవద్దని హెచ్చరిస్తున్నారు. దేవుడి సినిమా కాబట్టి ఆదిపురుష్ ప్రదర్శితమవుతున్న థియేటర్ల వద్ద ఎవరూ దురుసుగా ప్రవర్తించవద్దని చెప్పారు.
read more :
Adipurush Telugu Movie Review : ‘ఆదిపురుష్’ తెలుగు మూవీ రివ్యూ
Hanuman Seat : ఆదిపురుష్ సినిమా హాల్ లో ఆంజనేయుడి సీటు చూశారా ?