Telugu Flash News

Hanuman Seat : ఆదిపురుష్ సినిమా హాల్‌ లో ఆంజనేయుడి సీటు చూశారా ?

adipurush hanuman seat

adipurush hanuman seat

Photo of Hanuman Seat In Adipurush Theatres Goes Viral : గతంలో లాగా పౌరాణిక చిత్రాలు రావడం లేదు. మారుతున్న ట్రెండ్‌కు అనుగుణంగా ఇలాంటి సినిమాల సంఖ్య బాగా తగ్గిపోతోంది. అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు బాలీవుడ్‌లో ‘ఆదిపురుష్’ సినిమా రూపొందుతోంది. రామాయణం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ శ్రీరాముడిగా నటించాడు. ఈ సినిమా కి దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వం వహించారు.

భారీ బడ్జెట్ తో టెక్నికల్ వండర్ గా రూపొందిన ‘ఆదిపురుష్’ సినిమా జూన్ 16న గ్రాండ్ గా రిలీజ్ కానుంది. దాంతో ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాల్లో ఈ సినిమా హడావిడి కనిపిస్తోంది. ముఖ్యంగా ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ కి భారీ రెస్పాన్స్ వస్తోంది. ఫలితంగా కొన్ని కోట్ల రూపాయల గ్రాస్ కూడా రాబట్టింది.

‘ఆదిపురుష్’ సినిమా ప్రదర్శింపబడే ప్రతి థియేటర్లో ఆంజనేయుడి కోసం ఒక సీటు ఖాళీగా ఉంచాలని చిత్ర యూనిట్ నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే. రామ నామం వినిపించే ప్రతి చోటా ఆంజనేయుడు వస్తాడనే నమ్మకంతో ప్రతి థియేటర్ ఆంజనేయుడి కోసం ఒక సీటు ఖాళీగా ఉంచుతున్నట్లు చెప్పారు. కానీ ఇది ఎక్కడ అనేది వివరించబడలేదు. అలాగే, బరోడాలోని థియేటర్ నుండి వచ్చిన ఫోటోలో, రాముడు మరియు సీత ఉన్న హనుమంతుని యొక్క ఫ్రేమ్డ్ ఫోటో సీటుపై ఉంచబడి, దానిపై దండను ఉంచడం కనిపించింది. ఈ ఫోటో ఇప్పటికే ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేయగా ఇప్పుడు వైరల్‌గా మారింది.

adipurush hanuman seat in baroda

‘ఆదిపురుష్’ ప్రదర్శితమవుతున్న థియేటర్లలో ఆంజనేయుడి కోసం రిజర్వ్ చేసిన సీటు ఫోటో ఒకటి బయటకు వచ్చింది. ఇందులో సినిమా హాల్‌లోని సీటును కాషాయ రంగుతో అలంకరించారు. దానిపై సీతారామ రూపాన్ని గుండెల్లో దాచుకున్న ఆంజనేయుడి చిత్రంతోపాటు జై శ్రీరామ్ అనే నినాదం రాసి ఉంది. ఇప్పుడు ఆ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇదిలా ఉంటే ‘ఆదిపురుష్’ థియేటర్లలో ఆంజనేయుడి కోసం రిజర్వ్ చేసిన సీటు పక్కా సీటు భారీ ధరకు అమ్ముడుపోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే వీటిని చిత్ర యూనిట్ ఖండించింది. దీంతో ఈ పుకార్లకు బ్రేక్ పడింది. ఈ సినిమాలో ప్రభాస్ శ్రీరాముడిగా నటిస్తుండగా, ఆంజనేయుడిగా మరాఠీ నటుడు దేవదత్తా నాగే నటిస్తున్నారు.

read more news :

Adipurush Telugu Trailer (Final) goosebumps guaranteed ❤ | జై శ్రీరామ్ 🙏🏻

Exit mobile version