HomecinemaAdipurush 6 Days Collections : ఆదిపురుష్ హిట్ కొట్టాలంటే ఇంకా ఎంత రావాలి ? సినిమాకి నష్టం తప్పదా..? ?

Adipurush 6 Days Collections : ఆదిపురుష్ హిట్ కొట్టాలంటే ఇంకా ఎంత రావాలి ? సినిమాకి నష్టం తప్పదా..? ?

Telugu Flash News

Adipurush 6 Days Collections : యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఆదిపురుష్’. టి సిరీస్ బ్యానర్‌పై భూషణ్ కుమార్, కృష్ణ కుమార్, ప్రసాద్ సుతార్, రాజేష్ నాయర్ నిర్మిస్తున్నారు. దీనికి అజయ్ – అతుల్ సంగీతం అందించారు. ఈ సినిమాలో రాముడిగా ప్రభాస్, రావణుడిగా సైఫ్ అలీఖాన్, సీతగా కృతి సనన్, లక్ష్మణుడిగా సన్నీ సింగ్, హనుమంతుడిగా దేవదత్త నటించారు.

దాదాపు నెల రోజుల పాటు ప్రపంచ వ్యాప్తంగా తన ప్రభంజనం చూపి రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా ‘ఆదిపురుష్’. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కిన రామాయణం నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా మొదటి నుండే అందరి దృష్టిని ఆకర్షించింది. అందుకు తగ్గట్టుగానే ఈ సినిమా హక్కులకు అన్ని ప్రాంతాల్లోనూ భారీ డిమాండ్ ఏర్పడింది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా దాదాపు రూ. 120 కోట్ల వ్యాపారం, అలాగే మిగిలిన ఏరియాల రైట్స్ రూ. 240 కోట్ల థియేట్రికల్ బిజినెస్ అయింది.

‘ఆదిపురుష్’ సినిమా 6వ రోజు ఏపీ, తెలంగాణల్లో భారీగా పతనమైంది. ఫలితంగా నైజాంలో రూ. 65 లక్షలు, సీడెడ్‌లో రూ. 33 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 24 లక్షలు, తూర్పుగోదావరిలో రూ. 15 లక్షలు, పశ్చిమగోదావరిలో రూ. 12 లక్షలు, గుంటూరులో రూ. 9 లక్షలు, కృష్ణాలో రూ. 8 లక్షలు, నెల్లూరులో రూ. 6 లక్షలతో రూ. 1.72 షేర్, రూ. 3.30 కోట్ల గ్రాస్ మాత్రమే వసూలు చేసింది.

అలాగే ఈ సినిమాకు తెలుగులో 6 రోజులకు రూ. 74.30 కోట్లు, తమిళంలో రూ. 2.26 కోట్లు, కర్ణాటకలో రూ. 11.55 కోట్లు, కేరళలో రూ. 80 లక్షలు, హిందీ ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 63.80 కోట్లు, ఓవర్సీస్ రూ. 23.05 కోట్ల షేర్ వసూలు చేసింది. ఈ విధంగా ప్రపంచవ్యాప్తంగా 6 రోజుల్లో రూ. 175.76 కోట్ల షేర్, రూ. 355 కోట్ల గ్రాస్. ప్రపంచంలోని అన్ని ప్రాంతాలు కలిపి రూ. 240 కోట్ల బిజినెస్ జరుపుకున్నట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. అంటే రూ. 242 కోట్ల షేర్ తో ఈ సినిమా హిట్ స్టేటస్ అందుకుంటుంది. కానీ, 6 రోజుల్లో రూ. 175.76 కోట్ల షేర్ రాబట్టింది. అంటే.. అది రూ. 66.24 కోట్ల షేర్ వసూలు చేయాల్సి ఉంది.

‘ఆదిపురుష్’ చిత్రానికి తొలి వారాంతంలో ప్రపంచవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల నుంచి విశేష స్పందన లభించింది. కానీ, నాలుగో రోజు ఈ సినిమా అన్ని ఏరియాల్లో చతికిలపడింది. అప్పటి నుంచి క్రమంగా తగ్గుతూ వస్తోంది. ఆరో రోజు రూ. 5 కోట్లు రాబట్టింది. ఇలాగే కొనసాగితే సినిమా నష్టపోయే ప్రమాదం ఉంది.

read more :

-Advertisement-

Adipurush 4th Day Collections : కుప్పకూలిన ఆదిపురుష్ కలెక్షన్లు !?

Prabhas : రాకేష్ మాస్టర్ పై ప్రభాస్ కామెంట్స్.. వీడియో వైరల్

 

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News