Homebigg boss telugu season 6Bigg Boss 6: రెండో పెళ్లి చేసుకుంటాన‌న్న ఆది రెడ్డి... ఎందుకో తెలుసా?

Bigg Boss 6: రెండో పెళ్లి చేసుకుంటాన‌న్న ఆది రెడ్డి… ఎందుకో తెలుసా?

Telugu Flash News

Bigg Boss 6: బుల్లితెర బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ కార్య‌క్ర‌మం చివ‌రి ద‌శ‌కు చేరుకుంది. షో ఆద్యంతం ర‌స‌వ‌త్త‌రంగా సాగుతుంది. ఈ వారం నామినేష‌న్ ప్ర‌క్రియ‌ని కాస్త డిఫ‌రెంట్‌గా పెట్టిన బిగ్ బాస్ ఇక మంగ‌ళ‌వారం ఎపిసోడ్‌లో ఫ్యామిలీ మెంబర్స్ తో సర్‌ప్రైజ్‌ చేయడం, హౌజ్‌లో కోచింగ్‌ సెంటర్‌ని ఏర్పాటు చేయడంతో వినోదం పంచారు. ఈ టాస్క్‌లో భాగంగా నలుగురిని టీచర్లని చేయగా, మిగిలిన వాళ్లు స్టూడెంట్స్. వారిలో ఫైమా ఇంగ్లీష్‌ టీచర్‌, ఆదిరెడ్డి డాన్సింగ్ టీచర్, శ్రీ సత్య మేకప్‌ టీచర్‌, రాజ్‌ సింగింగ్‌ టీచర్ గా ఉన్నారు.. మొదట ఫైమా ఇంగ్లీష్ క్లాస్‌ ని నిర్వహించ‌గా, ఆమె తనకు వచ్చిరాని ఇంగ్లీష్‌తో ఇరగదీసింది. నవ్వులు పూయించింది.

ఫైమా `ఈ` ఎలిఫెంట్ స్పెల్లింగ్‌ తప్పు రాయడంతో కామెంట్లు చేశారు హౌజ్‌మేట్స్. ఇక ఫైమా బ‌ట్ల‌ర్ ఇంగ్లీష్‌తో సంద‌డి చేయ‌గా, కంటెస్టెంట్స్ చిన్న పిల్లలుగా మారి, టీచర్‌ చెప్పింది వినకుండా, ఆమెని విసిగిస్తూ కామెడీ పండించారు. షోని రక్తికట్టించే ప్రయత్నం చేశారు. అనంతరం మేకప్‌ క్లాస్‌ నిర్వహించగా, మేకప్స్ ఐటెమ్స్ తో శ్రీ సత్య కాసేపు సంద‌డి సింది. ఇక చివరగా ఆదిరెడ్డి డాన్సింగ్ క్లాస్‌ నిర్వహించారు. ఇందులో ఆదిరెడ్డి తన దారుణమైన డాన్సుతో సంద‌డి చేశారు. . అటూ ఇటు తిప్పుతూ కామెడీ డాన్సింగ్ తో హౌజ్‌ మొత్తాన్ని ఎంటర్‌టైన్‌ చేశారు.




ఇదిలా ఉంటే ఫైమా టీచర్‌గా చేసిన అనంతరం ఆదిరెడ్డిని సర్ప్రైజ్‌ చేశాడు బిగ్‌ బాస్‌. ఆయన భార్య కవిత, కూతురుని ఇంట్లోకి పంపించి సర్‌ప్రైజ్ చేయ‌గా, భార్యని, కూతురుని చూసి తెగ‌ ఉప్పొంగిపోయాడు ఆదిరెడ్డి. ఈ సందర్బంగా ఆదిరెడ్డి ఆటతీరుపై ఆమె ప్రశంసలు కురిపిస్తూ, బాగా ఆడుతున్నావు అంది. ఇక నా డాన్స్ వరస్ట్ గా ఉంది కదా? అని ఆదిరెడ్డి కవితను అడ‌గ‌డంతో తెగ న‌వ్వుకోవ‌చ్చు అని తెలిపింది.

గేమ్ లో కొట్టుకున్నా తిట్టుకున్నా కలిసి మెలిసి ఉండండని కవిత సూచ‌న చేసింది. రోహిత్‌, మెరీనాల ప్రస్తావన వచ్చినప్పుడు మీరు చాలా క్యూట్‌గా ఉంటారని తెలపగా, అవును కవిత నాకు ఎంతో నచ్చారు. వీరినిచూశాక నాకు రెండో పెళ్లి చేసుకోవాలనిపించింది అని ఆదిరెడ్డి అన్నాడు. ఇక ఆదిరెడ్డి కూతురు బ‌ర్త్ డే వేడుకలు హౌజ్‌లో జ‌రిగాయి. అనంత‌రం రాజ్ తల్లిని ఇంట్లోకి పంపించి సర్‌ప్రైజ్‌ చేశారు బిగ్‌ బాస్‌. వాళ్లమ్మ అందరి ఆటతీరుపై ప్రశంసలు కురిపించింది.

also read news:

2022 Tech Layoffs: రాబోయే కొన్ని వారాల్లో డేంజర్ బెల్స్ !!

-Advertisement-

 

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News