Telugu Flash News

Aadhar card : ఆధార్‌ కార్డులో చిరునామా మార్పుపై కీలక నిర్ణయం.. ఇకపై మరింత సులువుగా మార్చుకొనే చాన్స్‌!

aadhar card

ఆధార్ కార్డు (Aadhar card) .. ఇండియాలో చాలా కాలంగా అన్నింటికీ ఇదే కీలకంగా మారింది. సిమ్ కార్డు తీసుకోవడం మొదలు.. డ్రైవింగ్ లైసెన్సు, పాన్ కార్డు లాంటివి పొందాలన్నా.. ఉద్యోగాలు, వ్యాపారాలు.. ఇలా ఏవి చేసుకోవాలన్నా ఆధార్ కార్డు తప్పనిసరిగా ఉండాల్సిందే. మనకున్న చాలా డాక్యుమెంట్లకు కూడా ఆధార్ కార్డుతో లింకేజీ అయ్యి ఉంటాయి. త్వరలో ఓటర్ కార్డుకు కూడా అందరూ మ్యాండేట్‌గా ఆధార్ అనుసంధానం చేయనుంది కేంద్ర ఎన్నికల కమిషన్‌. ఇంతటి ముఖ్యమైన ఆధార్‌ కార్డులో చిరునామా మార్పు పెద్ద తలనొప్పిగా అనిపించే అంశం. అయితే, దీనిపై తాజాగా ఉడై వెలువరించిన నిర్ణయం వినియోగదారులకు ఊరటనిస్తోంది.

ఐడీ ప్రూఫ్‌లుగా పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్సు, పాస్ పోర్ట్, రేషన్ కార్డు లాంటివి ఉన్నప్పటికీ ఆధార్ కార్డు ఉంటేనే ఇవన్నీ చెల్లుబాటు అయ్యే పరిస్థితి ప్రస్తుతం నెలకొంది. ఆధార్ కార్డులో మన ఇంటి పేరుతో పాటు పూర్తి పేరు, మొబైల్ నంబరు, పుట్టిన తేదీ, ఇంటి చిరునామా వివరాలుంటాయి. అయితే, చిరునామా మార్పు కోసం గతంలో చాలా ఇబ్బందులు ఉండేవి. ప్రస్తుతం దీన్ని సరళతరం చేస్తూ ఉడై నిర్ణయం తీసుకుంది.





వినియోగదారులు ఆధార్‌ కార్డులో చిరునామా మార్పు చేసుకొనేందుకు భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (యూఐడీఏఐ) తాజాగా వెసులుబాటు కల్పించింది. ఆధార్‌లో భార్య, పిల్లల చిరునామా లాంటివి మార్చాలంటే ఇప్పటి వరకు వారి పేరుపై ఉండే గుర్తింపు కార్డును ప్రూఫ్‌గా చూపించాల్సి వచ్చేది. అలా కాకుండా కుటుంబ పెద్ద సెల్ఫ్‌డిక్లరేషన్‌ పత్రంతో పిల్లలు, జీవితభాగస్వామి చిరునామాను మార్చుకొనే కొత్త విధానాన్ని ఉడై ప్రకటించింది.

18 ఏళ్లు పైబడిన ఎవరైనా కుటుంబ పెద్దగా వ్యవహరించొచ్చు..

ఈ మేరకు సంస్థ మంగళవారం ప్రకటన విడుదల చేసింది. చిరునామా మార్పు కోసం ఇప్పటికే అమల్లో ఉన్న నిబంధనలకు అదనంగా ఈ కొత్త విధానాన్ని తీసుకొచ్చినట్లు ఉడై వెల్లడించింది. 18 ఏళ్లు నిండిన ఎవరైనా చిరునామా మార్పు కోసం కుటుంబ పెద్దగా వ్యవహరించే అవకాశం ఉందని ఉడై స్పష్టం చేసింది.

also read :

Pakistan Crisis : పాక్‌కు అప్పుల కష్టాలు.. విద్యుత్‌ ఆదా కోసం వినూత్న నిర్ణయాలు!

సీఐతో మహిళా ఎస్‌ఐ ప్రేమాయణం.. కమిషనర్‌ వద్ద పంచాయితీ.. ఏం తేల్చారంటే..!

 

Exit mobile version