Telugu Flash News

టాలీవుడ్ ఇండస్ట్రీ పై సినీ నటి అమల పాల్ షాకింగ్ కామెంట్స్

amala paul comments on tollywood industry

టాలీవుడ్ ఇండస్ట్రీ పై సినీ నటి అమల పాల్ షాకింగ్ కామెంట్స్ చేసింది. తెలుగు పరిశ్రమ కొన్ని కుటుంబాల చేతుల్లో ఉందంటూ ఇటీవల పాల్గొన్న ఒక ఇంటర్వ్యూ చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి.

2011 నుండి 2015 మద్య తెలుగు లో 4 సినిమాలు మాత్రమే చేసి తెలుగు పరిశ్రమకి ఎందుకు దూరమయ్యిందో ఆ ఇంటర్వ్యూ తెలిపింది. తాను ఇండస్ట్రీ లో అడుగుపెట్టినప్పుడు తెలుగు పరిశ్రమ కొన్ని కుటుంబాల చేతుల్లోనే ఉందన్న విషయం తెలిసిందని చెప్పింది.

ఆ కుటుంబాలు సినిమా రంగాన్ని శాసిస్తున్నాయని గ్రహించానంది. వారు చేసిన సినిమాలు కూడా విభిన్నంగా ఉంటాయని, తమ ప్రతి సినిమాలో ఇద్దరు కథానాయికలు ఉంటారని అన్నారు.

హీరోయిన్స్ ని కేవలం గ్లామర్ , ప్రేమ సన్నివేశాలు, పాటలకే పరిమితం చేశారని అమలాపాల్ తెలిపింది. ఆ సినిమాలు చాలా కమర్షియల్‌గా ఉంటాయని అందుకే తెలుగు పరిశ్రమకి దగ్గర కాలేకపోయానని ఆవేదన వ్యక్తం చేసింది.

కెరీర్ తొలిరోజుల్లో ఆడిషన్స్, మీటింగ్స్ వంటి ఇబ్బందులు ఎదుర్కొన్నానని అమలాపాల్ తెలిపింది. తమిళ సినిమాతో కెరీర్ ప్రారంభించడం తన అదృష్టంగా భావిస్తున్నానన్నారు.

అయితే కెరీర్ బిగినింగ్‌లో తాను నటించిన రెండు సినిమాలు ఇప్పటికీ విడుదల కాలేదని, ఆ తర్వాత తాను చేసిన ‘మైనా’ పెద్ద హిట్ అయ్యిందని చెప్పారు. ఆ సినిమా తర్వాత ఆఫర్లు క్యూ కట్టాయని చెప్పింది.

అమలాపాల్ తెలుగులో అల్లు అర్జున్ తో ‘ఇద్దరమ్మాయిలతో’ సిద్దార్థ్ తో ‘లవ్ ఫెయిల్యూర్’, నాని తో ‘జెండాపై కపిరాజు’ వంటి సినిమాల్లో నటించారు. చివరిసారి ‘పిట్టకథలు’ సినిమాలో కనిపించారు. రీసెంట్ గా తను నటించిన ‘కడవర్’ సినిమా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో విడుదలైంది.

జవాన్‌ సినిమా కోసం విజయ్ సేతుపతి రెమ్యునరేషన్‌ తెలిస్తే షాకవుతారు..!

 

Exit mobile version