Telugu Flash News

Vivek Oberoi | మొదటి ప్రేమ వివేక్ ఒబెరాయ్ జీవితాన్ని ఎలా మార్చింది?

vivek oberoi

వివేక్ ఒబెరాయ్ (Vivek Oberoi) తన జీవితంలోని ఒక అత్యంత వ్యక్తిగతమైన అనుభవాన్ని బహిర్గతం చేశారు. చిన్న వయసులోనే ప్రేమను అనుభవించిన ఆయన, ఆ ప్రేమ విషాదంతంలో ముగిసిన విషయాన్ని వెల్లడించారు.

13 ఏళ్ల వయసులోనే ప్రేమ:

వివేక్ ఒబెరాయ్ తన 13వ ఏటే తొలిసారి ప్రేమలో పడ్డారు. ఆయన కంటే ఏడాది చిన్నది ఆమె. ఆయనకు తన పై ప్రేమ చిగురించింది. భవిష్యత్తు గురించి కలలు కన్నారు. కలిసి జీవితం గడపాలని ఆశించారు.

విషాదం:

కానీ.. ఆయన ప్రియురాలు అనారోగ్యంతో బాధపడుతున్నట్లు తెలుసుకున్నారు. ఆమెకు క్యాన్సర్ చివరి దశ అని తెలిసి వివేక్ తట్టుకోలేకపోయాడు . ఆమె ఆసుపత్రి పాలైన తర్వాత ఆమెను చూసి వివేక్ తట్టుకోలేకపోయారు. కొన్ని నెలల తర్వాత ఆమె కన్నుమూశారు.

జీవితంపై ప్రభావం:

ఈ సంఘటన వివేక్ జీవితంపై ఎంతో ప్రభావం చూపించింది. ఆయన ఆ ఘోర అనుభవాన్ని మరిచిపోవడానికి చాలా కాలం పట్టింది. అయితే ఈ అనుభవం ఆయన్ని మార్చివేసింది. క్యాన్సర్‌తో బాధపడుతున్న చిన్నారులకు సహాయం చేయాలనే తపన ఆయనలో మొదలైంది.

పెళ్లి నిర్ణయం:

ఈ విషాదం తర్వాత వివేక్ పెళ్లి గురించి ఆలోచించడం మానేశారు. కానీ కుటుంబ సభ్యుల కోరిక మేరకు ప్రియాంక అల్వాను పెళ్లి చేసుకున్నారు.

వివేక్ ఒబెరాయ్ మాటల్లో:

“నాకు 13 ఏళ్లు ఉన్నప్పుడు మొదటిసారి ప్రేమలో పడిపోయాను. నాకంటే ఏడాది చిన్నది ఆమె. 18 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు తనతో నా ప్రేమ మొదలైంది. తనే నా జీవిత భాగస్వామి అని ఫిక్స్ అయ్యాను. పెళ్లి, పిల్లలు అంటూ జీవితం మొత్తం ఊహించుకున్నాను. కానీ ఓసారి తనకు ఆరోగ్యం బాలేదని చెప్పింది. జ్వరం అనుకున్నాను.. విశ్రాంతి తీసుకుని మళ్లీ వచ్చేస్తుందని అనుకున్నా.. కానీ చాలా రోజులకు కనిపించలేదు. ఫోన్ చేస్తే రెస్పాండ్ కాలేదు. దీంతో ఆమె బంధువులకు ఫోన్ చేస్తే తను ఆసుపత్రిలో ఉందని చెప్పారు. వెంటనే అక్కడికి వెళ్లి చూస్తే తనకు క్యాన్సర్ చివరి స్టేజ్ అని తెలిసింది. ఆసుపత్రిలో బెడ్ పై తనను చూసి తట్టుకోలేకపోయాను. రెండు నెలల్లోనే కన్నుమూసింది. ఆమె మరణాన్ని జీర్ణించుకోలేకపోయాను. తనను మర్చిపోయి మళ్లీ మనిషిగా మారడానికి చాలా కాలం పట్టింది. ఆ తర్వాతే క్యాన్సర్ తో పోరాడుతున్న చిన్నారులకు నా వంతు సాయం చేయాలనే ఆలోచన మొదలైంది” అంటూ చెప్పుకొచ్చారు.

Exit mobile version