Homecinemaతీవ్రంగా గాయపడ్డ హీరో విశాల్..ఆందోళనలో ఫ్యాన్స్‌

తీవ్రంగా గాయపడ్డ హీరో విశాల్..ఆందోళనలో ఫ్యాన్స్‌

Telugu Flash News

సినిమాల్లో యాక్షన్ సన్నివేశాల కోసం రిస్క్ చేసే హీరోల్లో విశాల్ ఒకరు. పోరాట సన్నివేశాలకు డూప్ లేకుండా వెళ్లి అభిమానులను ఆకట్టుకుంటున్నాడు. సినిమాని ఎంత సహజంగా తెరకెక్కిస్తే సినిమాకు అంత ప్లస్ అవుతుందని నమ్ముతున్న హీరో విశాల్. షూటింగ్ సమయంలో విశాల్ చాలాసార్లు గాయపడిన సంగతి తెలిసిందే. ఇటీవల లాఠీ సినిమా షూటింగ్‌లో విశాల్ ప్రమాదానికి గురయ్యాడు. విశాల్ తన తాజా సినిమా షూటింగ్ లో మరోసారి యాక్సిడెంట్ కు గురైనట్లు తెలుస్తోంది.

ఇటీవలే లాఠీ సినిమా షూటింగ్ పూర్తి చేసిన విశాల్ ప్రస్తుతం మార్క్ ఆంటోని సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈరోజు గురువారం ఉదయం ఈ సినిమా షూటింగ్ లో పాల్గొన్న విశాల్ భారీ యాక్షన్ సీన్ చేస్తుండగా ప్రమాదానికి గురయ్యాడు. ఈ ఘటనలో విశాల్‌కు తీవ్రగాయాలు కావడంతో షూటింగ్‌ను నిలిపివేశారు. గాయపడిన విశాల్ ప్రథమ చికిత్స అనంతరం షూటింగ్ నుంచి వెళ్లిపోయాడని, కొద్దిరోజులు విశ్రాంతి తీసుకోనున్నాడని సమాచారం.

మరిన్ని వార్తలు చదవండి 

కియారాతో ప్రేమ నిజమే..కాఫీ విత్ కరణ్ షో లో సిద్ధార్థ్

మహేష్ బాబు తో మాస్ మసాలా యాక్షన్ మూవీ : త్రివిక్రమ్

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News