ప్రముఖ బాలీవుడ్ నటుడు, మరాఠీ రంగస్థలం, సినీ, టీవీ నటుడు విక్రమ్ గోఖలే (77) కన్నుమూసినట్లు ఈ ఉదయం నుంచి ఆన్‌లైన్‌లో వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. ప్రముఖ బాలీవుడ్ నటులు అజయ్ దేవగన్, రితీష్ దేశ్‌ముఖ్, అలీ గోని, జావేద్ జాఫరీ తదితరులు కూడా ట్విట్టర్ ద్వారా తమ సంతాపాన్ని తెలిపారు. అయితే గోఖలే మృతి చెందాడన్న వార్తలపై గోఖలే కుటుంబ సభ్యులు స్పందిస్తూ.. గోఖలే బతికే ఉన్నారని, అయితే ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు. అతను ప్రస్తుతం లైఫ్ సపోర్టులో ఉన్నందున అతని కోసం ప్రార్థించమని గోఖలే కుమార్తె కోరింది.
గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న గోఖలే పూణెలోని దీనాత్ మంగేష్కర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే ఆయన ఎలాంటి సమస్యతో బాధపడుతున్నట్లు కుటుంబ సభ్యులు కానీ, ఆస్పత్రి వర్గాలు కానీ వెల్లడించలేదు. విక్రమ్ గోఖలే, ప్రముఖ మరాఠీ థియేటర్ మరియు సినీ కళాకారుడు చంద్రకాంత్ గోఖలే కుమారుడు. సూపర్ హిట్ సినిమాల్లో నటించారు.
2010లో దర్శకుడిగా మారి ‘ఆఘట్’ చిత్రానికి దర్శకత్వం వహించారు. మరాఠీ చిత్రం ‘అనుమతి’లో నటనకు గానూ జాతీయ ఉత్తమ నటుడి అవార్డు అందుకున్నారు. ఆయన రంగస్థల ప్రదర్శనకు గాను 2011లో ‘సంగీత నాటక అకాడమీ అవార్డు’ అందుకున్నారు. అలాగే ‘మిషన్ మంగళ్’, ‘హిచ్కీ’, ‘ఆయారీ’, ‘బ్యాంగ్ బ్యాంగ్’, ‘అగ్నిపథ్’ వంటి చిత్రాలు ఆయనకు మంచి పేరు తెచ్చిపెట్టాయి. విక్రమ్ గోఖలే చివరిసారిగా శిల్పాశెట్టి మరియు అభిమన్యు దాసాని నటించిన ‘నికమా’లో కనిపించారు. ఈ ఏడాది జూన్‌లో ఈ సినిమా విడుదలైంది.
also read news:
బిస్లరీ యజమాని తన కంపెనీని ముఖేష్ అంబానీకి బదులుగా టాటాకు ఎందుకు విక్రయిస్తున్నాడు?
ఆకాశంలో అద్భుతం.. ఈ ‘అరోరా బొరియాలిస్’ వెరీవెరీ స్పెషల్.. ఎందుకంటే..!?