HomecinemaSarath Babu : ఆసుప‌త్రిలో శ‌ర‌త్ బాబుకి చికిత్స‌.. ఏం జ‌రిగింది..!

Sarath Babu : ఆసుప‌త్రిలో శ‌ర‌త్ బాబుకి చికిత్స‌.. ఏం జ‌రిగింది..!

Telugu Flash News

తెలుగు, తమిళ చిత్రాల్లో హీరోగా, క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ గా న‌టించి ఎంతో మంది ప్రేక్ష‌కుల మ‌న‌సులు గెలుచుకున్నారు శ‌ర‌త్ బాబు(Sarath Babu). ఇప్పుడు ఆయ‌న వ‌య‌స్సు ఏడు ప‌దులు దాటింది. ఇటీవ‌ల ఆయ‌న పెద్ద‌గా ఎక్క‌డా క‌నిపించింది కూడా లేదు.

అయితే తాజా స‌మ‌చారం ప్ర‌కారం అనారోగ్యానికి గురైన ఆయ‌న చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలుస్తోంది. అయితే శరత్ బాబు అనారోగ్య సమస్య ఏంటి అనే దానిపై క్లారిటీ లేదు.

శ‌రత్ బాబు ఆసుపత్రిలో చేరారని విషయం తెలుసుకున్న కొందరు ప్రముఖులు ఆయన్ని పరామర్శించేందుకు ఆసుపత్రికి వెళుతుండ‌గా, మ‌రి కొంద‌రు త్వ‌ర‌గా కోలుకోవాల‌ని సోష‌ల్ మీడియా ద్వారా కోరుతున్నారు. శరత్ బాబు చివరగా వకీల్ సాబ్ చిత్రంలో నటించారు.

అయితే శరత్ బాబు త్వరగా కోలుకోవాలని టాలీవుడ్ నటి కరాటే కళ్యాణి కూడా త‌న సోష‌ల్ మీడియా ద్వారా తెలియ‌జేసింది. నాకు ఇష్టమైన హీరో అప్పట్లో అమ్మాయిల కలల రాకుమారుడు శరత్ బాబు త్వరగా కోలుకోవాలని స్వామి వారిని వేడుకుందాం శ్రీరామరక్ష అంటూ పోస్ట్ పెట్టింది.

also read :

dasara telugu movie review : ‘దసరా’ తెలుగు మూవీ రివ్యూ

-Advertisement-

Horoscope (30-03-2023) : ఈ రోజు రాశి ఫ‌లాలు ఎలా ఉన్నాయంటే?

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News