Telugu Flash News

క్రేజీ క్రేజీ గా నేచురల్ స్టార్ నాని ‘అంటే సుందరానికి’ అప్‌డేట్

ante sundaraniki movie update

శ్యామ్ సింగరాయ్ తో సాలిడ్ హిట్ కొట్టిన నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం ‘అంటే సుందరానికి’ అనే క్రేజీ ప్రాజెక్ట్ చేస్తున్నాడు. మలయాళం హీరోయిన్ నజ్రియా నజీమ్ ఈ రొమాంటిక్ కామెడీ మూవీ తో టాలీవుడ్ అరంగేట్రం చేస్తోంది.

ఫిబ్రవరి 24న నాని పుట్టినరోజు సందర్బంగా అతని అభిమానులను ప్రత్యేకంగా ఆశ్చర్యపరిచేందుకు మేకర్స్ ప్లాన్ చేసారు. రేపు సాయంత్రం 23న 04:05 గంటలకు ‘అంటే సుందరానికి అప్‌డేట్ ‘సుందర్ బార్త్‌డే బ్లాస్ట్’ ప్రకటించబడుతుందని మేకర్స్ ఫన్నీ పోస్టర్‌ను విడుదల చేశారు.

ఈ క్రియేటివ్ ప్రమోషన్ ప్రేక్షకులను అబ్బుర పరుస్తుంది. రేపు ‘సుందర్ బార్త్‌డే బ్లాస్ట్’ పై ఆసక్తిగా ఎదురుచూసేలా ఉంది.

మెంటల్ మదిలో మరియు బ్రోచేవారెవరురా చిత్రాలను డైరెక్ట్ చేసిన వివేక్ ఆత్రేయ ఈ చిత్రానికి రచన మరియు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్నారు . ఈ రొమాంటిక్ కామిడీ చిత్రానికి వివేక్ సాగర్ సంగీతం అందించారు.

నదియా, హర్ష వర్ధన్, సుహాస్, రాహుల్ రామకృష్ణ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమా ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకొని థియేటర్లలో గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతోంది.

Exit mobile version