Homecinemaపాత్రలే నన్ను వెతుక్కుంటూ వస్తున్నాయి : కిషోర్ కుమార్

పాత్రలే నన్ను వెతుక్కుంటూ వస్తున్నాయి : కిషోర్ కుమార్

Telugu Flash News

పొన్నియన్ సెల్వన్-1 (ponniyin selvan)లో కనీసం ముఖం కూడా సరిగ్గా కనిపించకుండా మేక్ అప్ తో తిరుగు బాటు దారులైన పాండ్యులకు నాయకుడిగా కిషోర్ కనిపించలేదు అతని పాత్ర రవి దాసన్ మాత్రమే కనిపించింది.

ఇప్పుడు అతను ‘కాంతారా’ (kantara) లో చేసిన ఫారెస్ట్ ఆఫీసర్ పాత్ర కూడా కాస్త విలక్షణ ఛాయలు ఉన్న పాత్రే అటువంటి పాత్రలు కిషోర్ తప్ప ఎవరూ చేయలేరు అన్నంతగా పాత్రలో ఒదిగిపోయి నటించడం కిషోర్ ప్రత్యేకత.

కన్నడ చిత్రసీమ సినీ పరిశ్రమకు ప్రకాష్ రాజ్ లాంటి ప్రతిభగల నటీనటులను పరిచయం చేసింది. అటువంటివారిలో కిషోర్ కుమార్ (kishore kumar) ఒకరు.

“ఒకేసారి రెండు విభిన్న పాత్రలతో ప్రేక్షకుల ముందుకు రావడం చాలా ఆనందంగా ఉంది. నేను కూడా వ్యవసాయం చేస్తూ ఉంటాను అందుకే కాంతారా లో పాత్ర నన్ను బాగా ఆకర్షించింది. మన తర్వాతి తరానికి ఈ అంతరించిపోతున్న సంస్కృతి, సంప్రదాయాల గురించి ఇంకా ప్రకృతి వనరుల గురించి మనం చెప్పగలగాలి” అన్నారు కిషోర్.

నటన పట్ల ఆసక్తి

తాను నటనలో కావాలని రాలేదని, వచ్చేలా చేసారని చెప్పారు కిషోర్. “చిన్నప్పుడు మా ప్రిన్సిపాల్ స్కూల్ లో నాటకంలో ఒక పాత్రకు నేను సరిగ్గా సరిపోతానని నన్నుఎంపిక చేసారు, కానీ నాకు అది ఇష్టం లేక అది తప్పించుకున్నాను. అయితే ఆ తర్వాత కూడా మా ప్రిన్సిపాల్ నన్ను వదలకుండా క్లాస్ రూమ్ బయట నిలబెట్టి ఆ పాత్రలో నటించేంత వరకు వదలలేదు”.

“అయితే ఆ సంఘటన నాలో నటన పట్ల ఆసక్తి పెంచింది తర్వాతి కాలంలో నేను చాలా నాటకాలలో నటించేలా చేసింది. కాలేజీ వరకు అది సాగింది. అటువంటి సమయంలోనే కన్నడ సినిమా ప్రొడ్యూసర్ యస్.భరత్ ను కలవడం జరిగింది. అలా 2004లో ‘కాంతి’ అనే కన్నడ సినిమాలో ఒక పాత్ర ద్వారా సినిమా పరిశ్రమకు పరిచయం అయ్యాను.

-Advertisement-

ఆ పాత్ర నాకు మంచి పేరు తీసుకురావడమే కాకుండా స్టేట్ అవార్డు కూడా తీసుకువచ్చింది. అలా మిగిలిన దక్షిణాది భాషల్లో అవకాశాలు పెరిగాయి” అని చెప్పుకొచ్చారు కిషోర్.

తెలుగు ప్రేక్షకులకు పరిచయం

kannada actor kishore kumar2006లో హ్యాపీ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యారు కిషోర్. తాను ఇండస్ట్రీకి వచ్చి ఈ సంవత్సరంతో 18 ఏళ్లు పూర్తి అయిందని అన్నారు కిషోర్. ఇంకా తెలుగు లో భీమిలి కబడ్డీ జట్టు ,కృష్ణం వందే జగద్గురుం, కార్తికేయ, చందమామ కథలు,PSV గరుడ వేగా, అర్జున్ సురవరం,వెంకీ మామా,ఆచార్య,శేఖర్ చిత్రాలలో కిశోర్ నటించి మెప్పించారు.

“పొన్నియన్ సెల్వన్ లో మొదట పార్తీబన్ పాత్రకు నన్ను అనుకున్నారు కానీ తర్వాత అలా మార్పులు జరిగి నాకు ఈ పాత్ర దక్కింది, అయితే నేను ఎప్పుడు ఇదే పాత్ర చేయాలని పట్టుబట్టను నన్ను వెతుక్కుంటూ పాత్రలు వస్తాయి తప్ప నాకోసం ప్రత్యేకంగా పాత్రలు తయారుకావు.

నాలాంటి బద్దకస్తులకు అదే సులభం ఏ సెట్ లో అయినా ఒకేలా ఉంటుంది అక్కడకు వెళ్లడం డైరెక్టర్ల ద్వారా పాత్ర గురించి తెలుసుకోవడం డైలాగులు గురించి తెలుసుకోవడం నా పాత్రకు పూర్తి న్యాయం చేయడం అదే నాకు సులభంగా ఉంటుంది.

ఈ 18 ఏళ్లలో అన్ని రకాల పాత్రలు వేసాను అనే సంతృప్తి ఉన్నా నా పిల్లలు ఎదుగుతున్నప్పుడు వాళ్లతో గడపలేకపోయాను అనే అసంతృప్తి ఉంది. నేను బలంగా నమ్మేది ఏంటంటే జీవితం ఇలానే ఉండాలి అనుకోకూడదు, ఎలా ఉంటే అలానే ముందుకు వెళ్ళిపోవాలి అంతే” అంటూ చెప్పుకొచ్చారు కిషోర్ కుమార్.

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News