ప్రస్తుత శీతాకాలంలో ఎసిడిటీ (Acidity) సమస్య చాలా మందిని బాధిస్తూ ఉంటుంది. తీసుకొనే ఆహారంలో మార్పులు చేసుకోవడం ద్వారా ఎసిడిటీని దూరం చేసుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. ముందుగా ఎసిడిటీ ఎందుకు వస్తుందనేది అందరూ తెలుసుకోవాలి. ఎసిడిటీ సమస్య వల్ల ఆహారం అరగకపోవడం, గొంతులోకి వస్తున్నట్లు అనిపించడం జరుగుతుంది. దీని వల్ల దగ్గు వస్తుంది. ఎసిడిటీ తీవ్రరూపం దాల్చితే కడుపు సంబంధ వ్యాధులు వస్తాయి.
మనం నిత్యం తీసుకొనే ఆహారంలో కొన్ని మార్పులు చేసుకోవడం వల్ల ఎసిడిటీ సమస్యను నివారించుకోవచ్చు. ఉదయం లేవగానే చాలా మందికి పరగడుపున టీ, కాఫీ లాంటివి తీసుకోవడం అలవాటుగా మారి ఉంటుంది. ఖాళీ కడుపుతో టీ, కాఫీలు తాగితే ఎసిడిటీకి దారి తీస్తుంది. ఈ అలవాటు వీలైనంత వరకు మానుకోవాలని నిపుణులు పేర్కొంటున్నారు.
చాలా మంది మసాలాలు, స్పైసీ ఫుడ్ ఇష్టపడుతుంటారు. ఇలా మసాలా ఎక్కువగా ఉన్న స్పైసీ ఫుడ్ తినడం వల్ల ఎసిడిటీ సమస్య తీవ్రం కావడానికి కారణమవుతుంది. ఎసిడిటీ ఎక్కువైతే గుండె దగ్గర మంటగా అనిపిస్తుంది. ఎప్పుడైతే స్పైసీ ఆహారం తీసుకుంటారో కొన్ని గంటల తర్వాత మన శరీరంలో యాసిడ్ పెరుగుతుంది. తద్వారా నిద్రలేమి, తలనొప్పి వచ్చి చేరుతాయి. గుండెకు రక్తప్రసరణలో ఇబ్బంది కలుగుతుంది. గుండె వేగం పెరుగుతుంది.
వీటిని అవాయిడ్ చేస్తే బెటర్..
పంచదార వల్ల ఎసిడిటీ ఇంకా అధికమవుతుంది. రోజూ కాఫీ, టీలలో, స్వీట్లు తినడం ద్వారా చక్కెరను మన బాడీలోకి పంపినట్లు అవుతుంది. చక్కెరకు బదులుగా బెల్లం, తేనె లాంటి సహజసిద్ధంగా లభించే వాటిని వినియోగించాలని నిపుణులు సూచిస్తున్నారు. పచ్చళ్లు ఎక్కువగా తిన్నా ఎసిడిటీ వస్తుంది. బయట మార్కెట్లో దొరికే కొన్ని పచ్చళ్లలో అధిక మోతాదులో మసాలాలు కలుపుతారు. ఊరగాయల్లో ఉండే వెనిగర్.. ఎసిడిటీ పెంచేందుకు దోహదం చేస్తుంది. మరోవైపు కూల్ డ్రింక్స్ ఎక్కువగా తాగినా ఎసిడిటీ వస్తుంది. వాటిని వీలైనంత వరకు తీసుకోకుండా ఉండేందుకు ప్రయత్నించాలి. కూల్ డ్రింక్స్ బదులుగా వాటర్ ఎక్కువగా తాగితే మంచిది.
also read news:
mrunal thakur latest instagram hot photos 2022
indra nooyi : పెప్సికో CEO అయిన భారతీయ మహిళ ఇంద్రా నూయి యొక్క స్ఫూర్తిదాయకమైన కథ