Aishwarya: ఇటీవలి కాలంలో సెలబ్రిటీ కపుల్ విడాకులు తీసుకుంటుండడం మనం గమనిస్తూ వస్తున్నాం. సమంత నాగ చైతన్య విడాకులు తర్వాత చాలా మంది సెలబ్రిటీ కపుల్స్ పలు కారణాల వలన విడాకులు తీసుకున్నారు.ధనుష్- ఐశ్వర్యల జంట విడిపోవడం కూడా హాట్ టాపిక్‌గా మారింది. ఇక రీసెంట్‌గా దీపిక రణ్‌వీర్ జంట కూడా విడిపోతున్నట్టు ప్రచారం జరిగింది. బాలీవుడ్ జంట దీపిక పదుకొనే.. రణ్‌వీర్ సింగ్ 2012లో ప్రేమలో పడగా, దాదాపు ఆరేళ్ల పాటు సీక్రెట్‌గా డేటింగ్ చేసుకున్నారు. ఈ క్రమంలోనే 2018లో వీళ్లిద్దరూ అగ్నిసాక్షిగా ఒక్కటయ్యారు.
వెటకారపు ట్వీట్…
కొద్ది రోజులుగా దీపిక పదుకొనే, రణ్‌వీర్ సింగ్ విడాకులు తీసుకుంటున్నారన్న వార్త దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ కావడంతో రణ్‌వీర్ స్పందించారు. తనని ఇప్పటికీ ప్రేమిస్తూనే ఉంటున్నా అంటూ క్లారిటీ ఇచ్చాడు. ఇక ఐశ్వర్యరాయ్ అభిషేక్ బచ్చన్ కూడా విడిపోతున్నట్టు ప్రచారాలు సాగగా, దానిపై అభిషేక్ స్పందించాడు. ఐశ్వర్యరాయ్ ఈ విడాకుల విషయంపై ఏ విధంగా స్పందించకపోయినప్పటికీ అభిషేక్ బచ్చన్ మాత్రం తనదైన స్టైల్ లో స్పందించాడు .
నేను విడాకులు తీసుకోబోతున్నాను అంటూ కొంతమంది ప్రచారం చేస్తుండడం నేను గమనిస్తున్నా. నాకు రెండో పెళ్లి ఎప్పుడు మీరే చెప్పండి. మరచిపోవద్దు అంటూ చాలా వెటకారంగా కామెంట్ చేశాడు అభిషేక్ బచ్చన్. కొంతకాలం ప్రేమించుకున్న ఈ జంట 2007 ఏప్రిల్ 20న గ్రాండ్ గా పెళ్లి చేసుకున్నారు. ఇక వీరికి 2014లో వీరికి ఆరాధ్య అనే పాప కూడా పుట్టింది. త్వరలో వీరికి మరో బేబి కూడా పుట్టనుందని ప్రచారం జరుగుతుంది. ప్రజెంట్ అభిషేక్ బచ్చన్ ఐశ్వర్యారాయ్ తమ తమ సినిమాలతో బిజీగా ఉండగా, రీసెంట్‌గా పొన్నియన్ సెల్వన్ చిత్రంతో పలకరించింది.