Homebigg boss telugu season 6Abhinaya Sri : బిగ్ బాస్ నాకు అన్యాయం చేశాడంటున్న అభిన‌య‌శ్రీ.. ఇంత‌కు ఏం జ‌రిగింది?

Abhinaya Sri : బిగ్ బాస్ నాకు అన్యాయం చేశాడంటున్న అభిన‌య‌శ్రీ.. ఇంత‌కు ఏం జ‌రిగింది?

Telugu Flash News

Abhinaya Sri : 21మంది స‌భ్యుల‌తో నాగార్జున హోస్ట్‌గా బుల్లితెర‌పై ప్ర‌సారం అవుతున్న షో బిగ్ బాస్ సీజ‌న్6. ఈ కార్య‌క్ర‌మం రెండు వారాలు పూర్తి చేసుకొని మూడు వారంలోకి అడుగుపెట్టింది. అయితే ఈ షో గ‌త సీజ‌న్స్‌కి భిన్నంగా న‌డుస్తుంది.

మొదటివారం ఎవర్ని ఎలిమినేట్ చేయకుండా రెండో వారం ఇద్దర్ని ఎలిమినేట్ చేసి షాక్ ఇచ్చారు. శనివారం నాడు షానిని ఎలిమినేట్ చేయగా, ఆదివారం నాడు అభినయశ్రీని ఎలిమినేట్ చేసి అంద‌రిని ఆశ్చ‌ర్యంలో ముంచెత్తారు. షానీని ఓట్లతో సంబంధం లేకుండా పంపించారని, సెండ్ ఆఫ్ వీడియో కూడా ప్లే చేయలేదని కొంద‌రు కామెంట్స్ చేస్తున్నారు.

బాధ‌ను వ్య‌క్తం చేసింది..

ఇక అభిన‌య‌శ్రీ విష‌యానికి వ‌స్తే ఆమెను కూడా స‌రైన కార‌ణం లేకుండానే పంపించేరాని ఆరోపిస్తుంది. బిగ్ బాస్ షోతో నాకు చాలా అన్యాయం జ‌రిగింద‌ని ఈ అమ్మ‌డు వాపోతుంది. హౌజ్ నుండి బ‌య‌ట‌కు వ‌చ్చాక ఓ ఛానెల్‌లో మాట్లాడిన అభిన‌య శ్రీ .. నా విష‌యంలో అన్యాయం జ‌రిగింది.

నన్ను ఎక్కువ సేపు చూపించ‌లేదు. దిగాలుగా కూర్చుని ఉండటమే చూపించారుగానీ, నేను మాట్లాడింది .. డాన్సులు చేసింది .. ఆర్గ్యుమెంట్ చేసింది ఇవేమి టీవీలో రాలేదు. బ‌య‌ట‌కు వ‌చ్చి చూసాక ఈ విష‌యం అర్ధ‌మైంది.

ఓటింగ్ విషయంలో నా కంటే క్రింద పొజిషన్ లో ఇద్దరు ఉండ‌గా, న‌న్ను ఎలిమినేట్ చేసి వారిని సేవ్ చేయ‌డం ఆశ్చ‌ర్యాన్ని క‌లిగిస‌తుంది. సెకండ్ ఇన్నింగ్స్ మొద‌లు పెడ‌దాం అని, నాలోని టాలెంట్ ను చూపించుకోవడానికే నేను బిగ్ బాస్ కి వెళ్లాను.

కానీ డే వన్ నుంచి న‌న్ను స‌రిగా చూపించ‌కుండా అన్యాయం చేశారు. అలా ఎందుకు చేయవలసి వచ్చిందనేదే నా బాధ” అంటూ ఆవేదనను వ్యక్తం చేసింది అభిన‌య శ్రీ.

-Advertisement-

ఇక ఎలిమినేట్ త‌ర్వాత బిగ్ బాస్ స్టేజ్‌పైకి వ‌చ్చిన అభిన‌య శ్రీని.. హౌస్ లో హానెస్ట్ ఎవరు..హానెస్ట్ కానిది ఎవరు అని అడగగా ఫైమా, చంటి, బాలాదిత్య, శ్రీసత్య, సూర్య లని హానెస్ట్ అని పేర్కొంది. రేవంత్ మాత్రమే కన్నింగ్ అంటూ షాకింగ్ కామెంట్స్ చేసి షాకిచ్చింది అభినయ.

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News