Homebigg boss telugu season 6Bigg Boss 6 : ఈ రోజు బిగ్ బాస్ నుండి ఎలిమినేట్ కానున్న మ‌రో కంటెస్టెంట్ ఎవ‌రో తెలిస్తే అవాక్క‌వ్వ‌డం ఖాయం...!

Bigg Boss 6 : ఈ రోజు బిగ్ బాస్ నుండి ఎలిమినేట్ కానున్న మ‌రో కంటెస్టెంట్ ఎవ‌రో తెలిస్తే అవాక్క‌వ్వ‌డం ఖాయం…!

Telugu Flash News

Bigg Boss 6 : నాగార్జున హోస్ట్‌గా బుల్లితెర ప్రేక్ష‌కుల‌కి పసందైన వినోదం పంచుతున్న షో బిగ్ బాస్ సీజ‌న్ 6. ఈ సారి 21 మంది కంటెస్టెంట్స్ హౌజ్‌లోకి అడుగుపెట్టారు. అయితే ఈ షో తొలి రోజు నుండే రంజుగా సాగుతుంది.

ఇక ఎలిమినేష‌న్ టైం వ‌చ్చిన‌ప్పుడు ఎంత ర‌స‌వ‌త్త‌రంగా ఉంటుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. తొలివారంలో నో ఎలిమేషన్స్ అంటూ చేతులెత్తేశారు. ఓట్లు గుద్దించుకుని ఎలిమినేషన్ ఎత్తేయడంపై విమర్శలు రావ‌డంతో రెండో వారంలో డ‌బుల్ ఎలిమినేష‌న్ అంటూ షాకింగ్ విష‌యం వెల్ల‌డించారు.

తొలివారంలో ఇనయ సుల్తానా, అభినయ శ్రీ, జబర్దస్త్ ఫైమా, శ్రీ సత్య, ఆరోహి, చలాకీ చంటి, సింగర్ రేవంత్ ఈ ఏడుగురు నామినేషన్స్‌లో ఉండగా.. అభినయ శ్రీ లేదంటే ఇనాయా ఎలిమినేట్ అయ్యేవాళ్లు.

సెకండ్ ఎలిమినేష‌న్..

రెండోవారంలో ఆది రెడ్డి, రోహిత్-మెరీనా, షానీ సాల్మన్, రాజ్, రేవంత్, అభినయ శ్రీ, ఫైమా, గలాటా గీతు ఈ ఎనిమిది మంది నామినేషన్స్‌లో ఉన్నారు. వీరిలో ఇద్దరిని ఎలిమినేట్ చేయబోతున్నారు. అయితే శ‌నివారం రోజు హౌజ్‌మేట్స్‌కి లెఫ్ట్ అండ్ రైట్ క్లాస్ పీకిన నాగార్జున షానుని ఎలిమినేట్ చేశాడు.

అత‌డికి ఘ‌న‌మైన వీడ్కోలు ఇవ్వ‌కుండానే పంపించేశారు. ఇక ఈ రోజు మ‌రో ఎలిమినేష‌న్ ఉంటుంద‌ని చెప్పుకు రాగా, ఎవ‌రై ఉంటుందా అని చ‌ర్చ‌లు న‌డుస్తున్నాయి.

మొద‌టి వారంలో ఎలిమినేష‌న్ నుండి జ‌స్ట్ మిస్ అయిన అభిన‌య శ్రీ ఈ సారి మాత్రం ఎలిమినేట్ కావ‌డం ప‌క్కా అంటున్నారు. ఆదివారం ఎపిసోడ్‌లో అభిన‌య శ్రీ ని బిగ్ బాస్ హౌజ్ నుండి బ‌య‌ట‌కు పంప‌డం ఖాయంగా క‌నిపిస్తుంది.

-Advertisement-

ఆదిరెడ్డి, రోహిత్-మెరీనా, రేవంత్, ఫైమా వీళ్లందరికీ కాస్తో కూస్తో ఓటు బ్యాంక్ ఉండ‌డంతో వారికి బాగానే ఓట్లు ప‌డుతున్నాయి. ఎటొచ్చీ రిస్క్‌లో పడింది మాత్రం అభినయ శ్రీ.. రెండోవారంలో కూడా ఏ మాత్రం పుంజుకోలేకపోయింది.

ఆమె ఆడటం లేదో.. లేదంటే బిగ్ బాస్ వాళ్లు చూపించడం లేదో కానీ.. ఆమె కనిపించే ఫ్రేమ్స్ చాలా త‌క్కువ‌. ఆమెకు ఎవరితోనూ గొడవలు లేవు.. గోలలు లేవు.. ఫుటేజ్ కూడా లేక‌పోవ‌డంతో ఈ రోజు ఆమె ఎలిమినేట్ కావ‌డం ప‌క్కాగా క‌నిపిస్తుంది.

 

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News