Telugu Flash News

Ab devilliers: ఇక క్రికెట్ ఆడ‌లేను.. క్ష‌మాప‌ణ‌లు చెప్పేందుకే ఇండియాకి వ‌స్తున్నానంటూ ఏబీడీ స్టేట్‌మెంట్…

AB de Villiers

AB de Villiers

Ab devilliers: ఏబీ డివిలియ‌ర్స్.. ఆయ‌న పేరుకి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. గ్రౌండ్‌కి ఏ మూల‌నైన షాట్ కొట్ట‌డంలో ఏబీడీ చాలా స్పెష‌ల్. 2018లో అంతర్జాతీయ క్రికెట్‌కి గుడ్ బై చెప్పేసిన ఏబీ డివిలియర్స్.. ఐపీఎల్‌కి కూడా రిటైర్మెంట్ ప్రకటించి అభిమానుల‌ని నిరాశ‌పరిచాడు. అయితే ఏబీ డివిలియర్స్ తన రిటైర్మెంట్‌ని వెనక్కి తీసుకుంటాడా? లేదా కోచింగ్ స్టాఫ్‌లోకి వస్తాడా? అనేది కొన్నాళ్ల నుండి చ‌ర్చ‌కు వ‌స్తుండ‌గా, తాజాగా ఓ ఆస‌క్తిక‌ర వార్త నెట్టింట హ‌ల్చ‌ల్ చేస్తుంది. ఏబీ డివిలియర్స్ ఆఖరిసారి బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియానికి రాబోతున్నాడట‌.

ఇక నేను ఆడ‌లేను..

ఐపీఎల్ 2023 సీజన్ భారత్‌లోనే జరగబోతోందని ఇప్పటికే భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ స్పష్టం చేసిన విష‌యం తెలిసిందే. అలానే టోర్నీలోని 10 జట్లు తమ సొంతగడ్డపై సగం మ్యాచ్‌లు ఆడబోతున్నట్లు కూడా గంగూలీ వెల్లడించాడు. దాంతో.. ఐపీఎల్ 2023 సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) టీమ్ చిన్నస్వామి స్టేడియంలో ఆడే మ్యాచ్‌లకి తాను వ‌చ్చి సంద‌డి చేయ‌నున్న‌ట్టు ఏబీ డివిలియర్స్ ప్రకటించాడు. దీంతో అభిమానుల్లో ఆనందం వెల్లివిరిసింది.

ఐపీఎల్ రిటైర్మెంట్‌ని వెనక్కి తీసుకోబోతున్నట్లు ఇటీవల ఊహాగానాలు వినిపించ‌గా, వాటిని ఖండిస్తూ తాను తీసుకున్న‌ నిర్ణయానికే కట్టుబడి ఉన్నట్లు స్పష్టం చేశాడు ఏబీ డివిలియర్స్. ఇక చిన్నస్వామి స్టేడియానికి వచ్చే ఏడాది కేవలం అభిమానులకి క్షమాపణలు చెప్పడానికే వస్తున్నట్లు పేర్కొన్నారు. ఆర్సీబీ ఇప్పటి వరకు ఐపీఎల్ టైటిల్ గెలవలేకపోయినందుకు అక్కడి అభిమానులకి క్షమాపణలు చెప్పేందుకు మాత్ర‌మే నేను వెళ్తాను. అలానే గత దశాబ్దకాలంగా వారు అందించిన సపోర్ట్‌కి కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేయాలిని అనుకుంటున్నాను. నేను ఇక క్రికెట్ ఆడలేను. అందుకు కార‌ణం నా కుడి కంటికి సర్జరీ జరిగింది’’ అని ఏబీ డివిలియర్స్ వెల్లడించాడు.

 

Exit mobile version