Taapsee Pannu: ఝుమ్మంది నాదం చిత్రంతో తెలుగు ప్రేక్షకులని అలరించిన అందాల ముద్దుగుమ్మ తాప్సీ. ఈ ముద్దుగుమ్మకి తెలుగులో అంతగా పేరు ప్రఖ్యాతలు రాకపోవడంతో బాలీవుడ్‌కి వెళ్లింది. అక్కడా మహిళా ప్రాధాన్యత చిత్రాలు చేయడంతో టాప్ హీరోయిన్స్‌లో ఒకరిగా మారింది.
ఈ అమ్మడు కొద్ది రోజుల క్రితం ‘శభాష్ మిథు చిత్రంతో పలకరించిన విషయం తెలిసిందే. థియేటర్లలో విడుదలైన ఈ సినిమా స్పోర్ట్స్ జానర్‌లో రూపొందగా, ఈ సినిమా పెద్దగా చూపించలేకపోయినప్పటికీ ఈసారి ‘దొబారా’ అనే సినిమాతో సస్పెన్స్, థ్రిల్లర్ కథాంశంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
ఎందుకంత కోపం..
దొబారా సినిమాకు సంబంధించి విడుదలైన రెండు ట్రైలర్లు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోవడంతో సినిమాపై అభిమానుల్లో ఆసక్తి మరింత పెరిగిందనే చెప్పాలి. అయితే ఈ సినిమా ఆశించినంతస్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. రీసెంట్‌గా తాప్సీ.. ఓటీటీ ప్లే అవార్డ్స్ 2022 వేడుకలకు హాజరయ్యింది.
ఈ అవార్డ్స్ వేడుకల అనంతరం మీడియాతో ముచ్చటిస్తున్న సమయంలో ఓ రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు ఆగ్రహం వ్యక్తం చేసింది. దొబారా సినిమాపై వచ్చిన నెగిటివ్ టాక్ గురించి ఓ విలేకరి అడగ్గా.. నెగిటివ్ టాక్ బారిన పడని చిత్రాలు ఉన్నాయా ? అంటూ రివర్స్ ప్రశ్నించింది తాప్సీ.
మరో ప్రశ్న విలేకరి అడగబోతున్న సమయంలో ముందు నేను అడిగిన దానికి సమాధానం చెప్పాలని కోరింది. ఏ చిత్రానికి నెగెటివ్ టాక్ రాలేదంటూ మండిపడింది.
ఆ క్రమంలో విలేకరి.. ఈ సినిమాని విమర్శకులు కూడా మెచ్చుకోలేదు కాదా ? అని అనగా.. ఈ టైప్ ప్రశ్నలు వేసే ముందు కాస్త హోమ్ వర్క్ చేయడం మంచిది. మేం ఏం మాట్లాడిన కూడా మాకు మర్యాద లేదు అంటారు అంటూ తాప్సీ అసహనం వ్యక్తం చేసింది. ఆమెకు కొందరు మద్దతు తెలియజేస్తుండగా, మరి కొందరు ఆమె ప్రవర్తనపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మరిన్ని వార్తలు చదవండి :
Nagarjuna: సమంత,నాగ చైతన్య విడాకులపై స్పందించిన నాగార్జున.. సామ్ వెళ్లిపోవడం దురదృష్టకరం..!