aamir khan Spotted Using Walking Stick in a Wedding in Rajasthan : బాలీవుడ్ మిస్టర్ పర్‌ఫెక్ట్ అమీర్ ఖాన్‌కి ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కెరీరర్‌లో ఎన్నో అత్యద్భుతమైన చిత్రాలు చేసిన అమీర్ అశేష ప్రేక్షకాదరణ పొందాడు. తాజగా ఆయన రాజస్తాన్ లోని జైపూర్ లో జరుగుతున్న ది వాల్డ్ డిస్నీ కంపెనీ ఇండియా, స్టార్ ఇండియా అధ్యక్షుడు కె మాధవన్ కుమారుడి పెళ్లికి హాజరయ్యారు.
ఈ వేడుకకు బాలీవుడ్ నుండి మాలీవుడ్ వరకు సినీ ప్రముఖులు హాజరయ్యారు. అక్షయ్ కుమార్, మలయాళ నటుడు మోహన్ లాల్ , కరణ్ జోహార్, అమీర్ ఖాన్, కమల్ హాసన్ ప్రముఖులు పాల్గొని సందడి చేశారు.
కె. మాధవన్ కుమారుడి పెళ్లిలో నటులంతా తెల్లని సంప్రదాయ దుస్తుల్లో మెరిసిపోయారు. దక్షిణాది స్టైల్ లుంగీ, కుర్తా, ఫైజామాలను ధరించగా, అమీర్ ఖాన్ కూడా సంప్రదాయ దుస్తుల్లో కనిపించారు. అయితే ఆయన వాక్ స్టిక్ సాయంతో నిల్చుని కనిపిస్తుండటంతో అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అమీర్ ఖాన్ కాలికి ఏమైంది, ఆయన వాకింగ్ స్టిక్ ఎందుకు ఉపయోగిస్తున్నారంటూ నెటిజన్లు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.
also read :
Smart Phone: స్మార్ట్ ఫోన్ ఎఫెక్ట్.. హైదరాబాద్ మహిళ కంటి చూపు కోల్పోయింది!
Viral Video: పెళ్లిలో పన్నీర్ కోసం లొల్లి.. బుర్రలు పగిలేలా కొట్టుకున్నారు!