Telugu Flash News

Aamani: త‌న‌ని ఒంట‌రిగా ర‌మ‌న్నాడంటూ షాకింగ్ వ్యాఖ్య‌లు చేసిన ఆమ‌ని..!

actress aamani latest news

Aamani: ఒక‌ప్ప‌టి అందాల తార‌ల జాబితా చూస్తే అందులో ఆమ‌ని త‌ప్ప‌క ఉంటారు. జంబలకిడిపంబ, మిస్టర్ పెళ్ళాం, శుభలగ్నం, మావిచిగురు వంటి కుటుంబ కథా చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల మనసు గెలుచుకున్న ఆమని కొన్ని సినిమాల‌లో గ్లామరస్ పాత్ర‌లు కూడా పోషించింది.

అయితే త‌ను ఇండ‌స్ట్రీలోకి అంత ఈజీగా రాలేద‌ని చెప్పింది ఆమ‌ని. ఆడిషన్స్ కోసం కోలీవుడ్ లో కొన్ని కంపెనీలకు వెళ్లేదాన్నని చెప్పిన ఒక కంపెనీకి వెళ్తే.. చెప్పి పంపిస్తామని అనేవారని, తర్వాత రోజు ఫోన్ చేసి బీచ్ కి వస్తారా అని అడిగేవారని సంచ‌ల‌న కామెంట్స్ చేసింది.

అమ్మ నాతో పాటు వ‌స్తారంటే ఆమె అవసరం లేదు మీరొక్కరే వస్తే చాలు అని మేనేజ‌ర్ అనే వార‌ని ఆమ‌ని తాజాగా కాస్టింగ్ కౌచ్‌పై నోరు విప్పింది. వారు త‌న‌ని డైరెక్ట్ గా అడగకుండా ఇన్ డైరెక్ట్ గా అడిగేవారని.. అయితే మొదట్లో తనకు ఇలా ఉంటారని తెలియదని, అస‌లు వారు దేనికి పిలుస్తున్నారో కూడా తెలిసేది కాదు.

అయితే ఇలాంటివి ఇండస్ట్రీలో ఉంటాయి అని మేనేజర్స్ చెప్పడంతో అప్పటి నుంచి తాను చాలా జాగ్రత్త పడినట్లు చెప్పారు ఆమ‌ని. ఇండస్ట్రీలో చెడ్డ వాళ్ళే కాదని, మంచి వాళ్ళు కూడా ఉన్నారని , వారితోనే తాను ప‌ని చేశానంటూ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసింది.

also read :

health benefits of beans | బీన్స్‌ తింటే చక్కటి ఆరోగ్య ప్రయోజనాలు..

Chandrababu Naidu : బాబాయి హత్య కేసులో జగన్‌ దొరికిపోయారు.. కన్నా చేరిక సందర్భంగా చంద్రబాబు వ్యాఖ్యలు!

 

Exit mobile version