Telugu Flash News

ఆది పినిశెట్టి CLAP చిత్రం ట్రైలర్‌ విడుదల

ఈ మద్య స్పోర్ట్స్ డ్రామా మూవీస్ మంచి విజయాలు సాదిస్తున్నాయి. ప్రస్తుతం యువ హీరో ఆది పినిశెట్టి హీరోగా CLAP అనే చిత్రం లో నటిస్తున్నాడు . ఈ మూవీ సోనీ లివ్ లో స్ట్రీమింగ్ కానున్నట్లు కొన్ని రోజుల క్రితం తెలియజేసారు. ఈరోజు, 06-03-2022 OTT లో ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు. ట్రైలర్ ను చూస్తే, ఈ మూవీ ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామా గా కనిపిస్తుంది. ఈ వీడియో లో ఆది పినిశెట్టి అంగవైకల్యం కలిగిన అథ్లెట్‌గా కనిపిస్తాడు.

జాతీయ ఛాంపియన్‌ అయిన ఆది కి ఒక చిన్న విలేజ్ కి చెందిన ఒక యువ మహిళా అథ్లెట్ తెలుసుకుంటాడు. ఆ మహిళ కి శిక్షణ ఇవ్వమని ఆది చాలా మంది కోచ్‌లను అడుగుతాడు, కానీ ఎవ్వరూ కోచింగ్ ఇవ్వడానికి ఒప్పుకోరు. అప్పుడు , అతను ఆమెకు శిక్షణ ఇవ్వాలని నిర్ణయించుకుంటాడు. ఆ తర్వాత ఆ మహిళా అథ్లెట్ జాతీయ ఛాంపియన్ అవుతుందా? అసలేం జరుగుతుంది ? ఈ ఆసక్తికరమైన స్టోరీ ని తెరపైన చూడాల్సిందే . ఈ మూవీ మార్చి 11, 2022న ప్రీమియర్‌గా రిలీజ్ అవుతుందని సోనీ LIV ప్రకటించింది. పృధ్వీ ఆదిత్య దర్శకత్వం వహించిన ఈ మూవీలో ప్రకాష్ రాజ్, నాజర్ , బ్రహ్మాజీ, ఆకాంక్ష సింగ్, కృష్ణ కురుప్, తదితరులు నటించారు. ఈ స్పోర్ట్స్ డ్రామా మూవీ కి ఇళయరాజా సంగీతం అందించారు.

Exit mobile version