Telugu Flash News

ఎప్పటికీ మర్చిపోలేని రోజు అది : ఆది – నిక్కీ ల పెళ్లి వీడియో

కథానాయిక నిక్కీ గల్రానీతో నటుడు ఆది పినిశెట్టి వివాహం అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది మేలో పెళ్లి చేసుకున్న ఈ జంట ఇప్పటికే తమ పెళ్లి ఫోటోలను షేర్ చేశారు. తాజాగా వీరిద్దరూ తమ పెళ్లి వీడియో ను సోషల్‌ మీడియాలో షేర్ చేశారు. మాకు పెళ్లయి మూడు నెలలైంది. అయితే ఇదంతా నిన్ననే అయినట్టు అనిపిస్తుంది. అది మేము ఎప్పటికీ మర్చిపోలేని రోజు. దీనికి సంబంధించిన మరిన్ని వీడియోలు త్వరలో రానున్నాయిఅని చెప్పారు.

ప్రస్తుతం ఈ వీడియో హల్‌చల్ చేస్తోంది. హల్దీ, మెహందీలతో పాటు పెళ్లి వరకు ఆది-నిక్కీ ప్రతి క్షణాన్ని ఎంతో ఆనందంగా జరుపుకున్నట్లు వీడియోలో స్పష్టంగా ఉంది. 2015లో వచ్చిన ‘యాగవరైనమ్‌ నా కక్కా’ సినిమాలో ఆది-నిక్కీ తొలిసారి స్క్రీన్ షేర్ చేసుకోగా.. ‘మరగధ నాణ్యం’ సినిమాతో ప్రేమలో పడ్డారు. ఈ ఏడాది వీరి వివాహం జరిగింది.

రజనీకాంత్ సరసన తమన్నా.. ఛాన్స్ కొట్టేసిన మిల్కీ బ్యూటీ

‘కాఫీ విత్ కరణ్’ షో పై తాప్సీ షాకింగ్ కామెంట్స్

 

Exit mobile version