Homenationalక్లాస్ జరుగుతుండగా గుండెపోటుతో యువకుడు మృతి.. వీడియో

క్లాస్ జరుగుతుండగా గుండెపోటుతో యువకుడు మృతి.. వీడియో

Telugu Flash News

మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ఓ యువకుడు క్లాస్‌లోనే గుండెపోటుతో మృతిచెందాడు. రాజా లోధి (22) అనే ఈ యువకుడు ఇండోర్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలకు సిద్ధమవుతున్నాడు. గురువారం రాత్రి కోచింగ్ క్లాసులో పాల్గొంటున్న సమయంలో అతనికి గుండెపోటు వచ్చింది. అతడు క్షణాల్లోనే బెంచ్‌పై కుప్పకూలిపోయాడు.

స్నేహితులు వెంటనే అతడిని ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే, అప్పటికే అతను మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు.

అతని మరణం కుటుంబసభ్యులు, స్నేహితులను తీవ్ర విషాదంలో ముంచేసింది.

 

 

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News