HomenationalPT Usha: రాజ్యసభలో అరుదైన సన్నివేశం.. సభను నిర్వహించిన పీటీ ఉష

PT Usha: రాజ్యసభలో అరుదైన సన్నివేశం.. సభను నిర్వహించిన పీటీ ఉష

Telugu Flash News

Rajya Sabha MP PT Usha in the Speaker chair conducts proceedings in the House during Budget Session of Parliament : పార్లమెంటు సమావేశాలు ప్రస్తుతం వాడీవేడిగా జరుగుతున్నాయి. విపక్షాల ఆందోళన మధ్య ఉభయ సభలు అట్టుడుకుతున్నాయి. ప్రస్తుతం అదానీ షేర్ల వ్యవహారం అటు రాజ్యసభ, ఇటు లోక్‌సభలో గరంగరంగా చర్చనీయాంశంమైంది. మరోవైపు ప్రధాని మోదీ ధీటైన సమాధానాలు కూడా ఇస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా ఓ ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. పెద్దల సభలో అరుదైన సన్నివేశం కనిపించింది. ప్రముఖ అథ్లెట్‌, పరుగుల రాణి పీటీ ఉష గురువారం రాజ్యసభ అధ్యక్ష స్థానాన్ని అలంకరించారు.

చైర్మన్‌ కుర్చీలో కూర్చున్న పీటీ ఉష.. రాజ్యసభ కార్యకలాపాలను పర్యవేక్షించారు. తాజాగా ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి పీటీ ఉష ట్విట్టర్‌లో షేర్‌ చేశారు. తన జీవితంలో అరుదైన సన్నివేశాన్ని పంచుకున్న పీటీ ఉష సంతోషాన్ని వ్యక్తం చేశారు. దీంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ట్విట్టర్‌లో తన అనుభూతిని పేర్కొన్నారు. ప్రాంక్లిన్‌ డి.రూజ్‌వెల్ట్‌ చెప్పిన విధంగా గొప్ప స్థానం ఇంకా గొప్ప బాధ్యతను కలిగి ఉంటుందని పీటీ ఉష పేర్కొన్నారు.

రాజ్యసభ సెషన్‌ను నిర్వహిస్తున్నప్పుడు తనకు అలాంటి భావనే కలిగిందని పీటీ ఉష సంతోషం వ్యక్తం చేశారు. ప్రజలు తనపై ఉంచిన నమ్మకంతో తన ప్రయాణంలో మరింత పరిణితి సాధిస్తానంటూ పీటీ ఉష పేర్కొన్నారు. తాను బాధ్యతలు నిర్వహిస్తున్న వీడియోను పంచుకున్న నేపథ్యంలో నెటిజన్లు ఆమెను అభినందనలతో ముంచెత్తుతున్నారు. అభినందన సందేశాలు వెల్లువెత్తాయి. పీటీ ఉషను అలా చూడటం గర్వంగా ఉందంటూ పలువురు కామెంట్లు పెట్టారు.

జీవితంలో మరింత ముందుకు వెళ్లాలని కోరుకుంటున్నట్లు కామెంట్లు పెట్టారు. మరో చరిత్ర సృష్టించాలని కోరుకున్నారు. మహిళలందరికీ పీటీ ఉష స్పూర్తివంతంగా నిలిచారని కొనియాడారు. సాధారణంగా రాజ్యసభ చైర్మన్‌, డిప్యూటీ చైర్మన్‌ లేని సమయాల్లో వైస్‌ చైర్‌పర్సన్ల కమిటీలోని సభ్యులు ఎవరో ఒకరు సభాధ్యక్ష బాధ్యతలు చూసుకుంటారు. గతేడాది రాజ్యసభకు నామినేట్‌ అయిన పీటీ ఉష.. ఈ కమిటీలో సభ్యురాలు అయ్యారు. రాజ్యసభలో చైర్మన్‌ కుర్చీలో కూర్చున్న అనుభూతి గొప్పగాఉందంటూ పీటీ ఉష పేర్కొన్నారు

Also Read:

-Advertisement-

Chiranjeevi: త‌న‌పై కోడిగుడ్లు విసిరారని చెప్పిన చిరంజీవి.. అవాక్క‌వుతున్న అభిమానులు

Prabhas : మిర్చి జ్ఞాపకాలు.. అనుష్క ప్రభాస్ ని నిజంగా ఎత్తుకుందా ?

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News