HomesportsInd vs Nz: ఇండియా - న్యూజిలాండ్ సిరీస్‌తో అమెజాన్ ప్రైమ్‌కి భారీ దెబ్బ‌..

Ind vs Nz: ఇండియా – న్యూజిలాండ్ సిరీస్‌తో అమెజాన్ ప్రైమ్‌కి భారీ దెబ్బ‌..

Telugu Flash News

Ind vs Nz: ఆస్ట్రేలియా వేదికగా జరిగిన టీ20 ప్రపంచకప్ 2022లో భారత జట్టు దారుణంగా నిరాశపరిచిన విషయం తెలిసిందే. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో తేలిపోయిన భారత్.. సెమీస్ మ్యాచ్‌లో టోర్నీ నుంచి నిష్క్రమించింది.

ఇక పొట్టి టోర్నీ అనంతరం టీమిండియా మూడు టీ20లు, మూడు వన్డేల సిరీస్‌ల కోసం న్యూజిలాండ్ పర్యటనకు వెళ్ళింది. ఆతిథ్య కివీస్‌తో భారత్ అమీతుమీ తేల్చుకోగా, టీ20 సిరీస్‌ని భార‌త్ ద‌క్కించుకోగా, వ‌న్డే సిరీస్ న్యూజిలాండ్ సాధించింది.

భారత్ vs న్యూజిలాండ్ సిరీస్ కోసం అమెజాన్ ప్రైమ్ వీడియో కొత్త ఫీచర్లతో భారత్, న్యూజిలాండ్ సిరీస్ మ్యాచ్‌లను ప్రత్యక్ష ప్రసారం చేసింది.

క్రికెట్ అభిమానులకు కొత్త అనుభూతిని అందించడానికి ‘ఇన్-గేమ్ లాంగ్వేజ్ సెలెక్టర్’ మరియు ‘రాపిడ్ రీక్యాప్’ వంటి కొన్ని కొత్త ఫీచర్‌లను తీసుకొచ్చింది.

ఇన్-గేమ్ లాంగ్వేజ్ సెలెక్టర్ ద్వారా కస్టమర్‌లు ప్లేయర్ నుంచి నిష్క్రమించకుండానే భాషను మార్చుకోవచ్చు. అంటే.. లైవ్ మ్యాచ్ రన్ అవుతుండగానే తెలుగు నుంచి ఇంగ్లీషు లేదా హిందీకి మారొచ్చు.

ఇక రాపిడ్ రీక్యాప్ ఆప్షన్ ద్వారా కస్టమర్‌లు ఆటోమేటిక్‌గా లైవ్ స్ట్రీమ్‌ సహా గేమ్ హైలైట్‌లను తెలుసుకోవచ్చు.

-Advertisement-

ప్రైమ్ వీడియో కామెంటరీ టీమ్‌లో రవిశాస్త్రి, హర్షా భోగ్లే, జహీర్ ఖాన్, అంజుమ్ చోప్రా, గుండప్ప విశ్వనాథ్, వెంకటపతి రాజు వంటి సీనియర్లు ఉన్నారు. ఇంగ్లీష్, హిందీ, తమిళం, తెలుగు మరియు కన్నడ భాషలలో అమెజాన్ ప్రైమ్ వీడియో వ్యాఖ్యానం అందించారు.

అంతా గ‌ట్టిగానే ప్లాన్ చేసిన ఈ రెండు సిరీస్‌లతో భారత క్రికెట్ అభిమానులను తమవైపు తిప్పుకోవాలని భావించిన అమెజాన్ సంస్థకు వర్షం కారణంగా గట్టి ఎదురుదెబ్బ తగిలింది.

టీమిండియాలో యువత ఎక్కువగా ఉండటం.. సినిమాల కంటే ఎక్కువగా క్రికెట్‌ను మతంలా ఆరాధిస్తుండటంతో ఈ మార్కెట్‌ను గ్రాబ్ చేయాలని అమెజాన్ ఎంతో ప్రయత్నించింది.

భారీ మొత్తంలో కొత్త సబ్‌స్క్రిప్షన్‌లను ఆశించిన అమెజాన్‌కు ఫలితం దక్కలేదు. మ్యాచ్‌లు సజావుగా సాగి.. రసవత్తరంగా జరిగి ఉంటే చాలా మంది ఆసక్తి కనబరిచేవారేమో.

కానీ వర్షంతో 4 మ్యాచ్‌లు రద్దవ్వడంతో అమెజాన్‌ వ్యూహం బెడిసికొట్టినట్లైంది. ఈ పర్యటనలో గెలిచింది న్యూజిలాండ్, భారత్ కాదని వరణుడేనని కొంద‌రు నెటిజ‌న్స్ కామెంట్ చేస్తున్నారు.

read also :

beauty tips in telugu : రాత్రిపూట చర్మ సంరక్షణ కోసం కొన్ని చిట్కాలు…

ఈ వస్తువులను ఎవ్వరితో షేర్ చేసుకోకూడదని మీకు తెలుసా ?

 

 

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News