Homecinemaప్రభాస్‌, కృతిసనన్‌ నిజంగా లవ్ లో ఉన్నారా ? వరుణ్‌ ధావన్‌ చెప్పేశాడు గా.. వీడియో వైరల్‌

ప్రభాస్‌, కృతిసనన్‌ నిజంగా లవ్ లో ఉన్నారా ? వరుణ్‌ ధావన్‌ చెప్పేశాడు గా.. వీడియో వైరల్‌

Telugu Flash News

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, కృతిషనన్ డేటింగ్ లో ఉన్నారనే వార్తలు కొంతకాలంగా వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. ఆదిపురుష్‌ సినిమాలో వీరిద్దరూ జంటగా నటించారని, షూటింగ్ సమయంలో ప్రేమలో పడ్డారని ప్రచారం జరుగుతోంది.

ఈ పుకార్లకు మరింత బలం చేకూర్చడంతో ప్రభాస్‌ను పెళ్లి చేసుకుంటానని కృతి ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. తాజాగా బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ కూడా ప్రభాస్ – కృతిసనన్‌ల రిలేషన్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

బేఢియా సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా వరుణ్, కృతిసనన్ రియాల్టీ షోకి గెస్ట్‌లుగా వెళ్లారు. ఈ క్రమంలో కృతి మనసులో ఎవరైనా ఉన్నారా అనే ప్రశ్నకు వరుణ్ ధావన్ సమాధానమిచ్చాడు..

కృతి మనసులో ఓ హీరో ఉన్నాడు. తాను ఇప్పుడు ముంబైలో లేడని, దీపికా పదుకొణెతో షూటింగ్‌లో ఉన్నానని హింట్ ఇచ్చాడు. కృతి కూడా అతని మాటలకు సిగ్గుపడుతూ నవ్వింది. నిజమే కదా Project-k మూవీ లో ప్రభాస్ తో దీపికా చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆ మూవీ షూటింగ్ సాగుతుంది.

ప్రస్తుతం ఆ రియాల్టీ షో కి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఓ షోలో కృతి ప్రభాస్‌కి ఫోన్ చేయడం, టీజర్ ప్రమోషన్స్‌లో ఆదిపరుష్ ప్రభాస్‌కి దగ్గరగా ఉండటం చూస్తుంటే వీరిద్దరూ డేటింగ్‌లో ఉన్నారని బీటౌన్‌లో జోరుగా టాక్‌ వినిపిస్తోంది.

-Advertisement-

read more:

Sanju Samson: ఆ క్రికెట‌ర్‌నే బ‌లి ప‌శువుని చేస్తున్నారా.. ఆట ఆడ‌కున్నా మ‌నసులు గెలుచుకున్న సంజూ

ఉపవాసం వల్ల ఆరోగ్యానికి కలిగే 12 అద్భుత ప్రయోజనాలు

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News