HomesportsHardhik Pandya: అప్పుడే పొగ‌రు త‌లకెక్కిందా.. హార్ధిక్ పాండ్యాపై ట్రోల్స్

Hardhik Pandya: అప్పుడే పొగ‌రు త‌లకెక్కిందా.. హార్ధిక్ పాండ్యాపై ట్రోల్స్

Telugu Flash News

Hardhik Pandya: టీ20 ప్రపంచకప్ 2022 వైఫల్యం అనంతరం టీమిండియా న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లగా.. మూడు టీ20ల సిరీస్‌కు హార్దిక్ సారథ్యం వహించిన విష‌యం తెలిసిందే.

తొలి టీ20 వ‌ర్షం వ‌ల‌న ర‌ద్దు కాగా, రెండో టీ20లో ఘ‌న విజ‌యం సాధించారు. ఇక మూడో టీ 20 డ‌క్ వ‌ర్త్ లూయిస్ ప‌ద్ద‌తి ప్ర‌కారం టై కావ‌డంతో సిరీస్‌ను 1-0తో గెలిచిన హార్దిక్.. మూడో టీ20 అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. కాస్త అహంకారపూరిత వ్యాఖ్యలు చేశాడు.

సంజూ శాంసన్, ఉమ్రాన్ మాలిక్‌లకు తుది జట్టు అవకాశం ఇవ్వకపోవడంపై ప్ర‌శ్న‌లు సంధించ‌గా, ఇది నా జట్టు నా ఇష్టమని సమాధానమిచ్చాడు. బయటి వ్యక్తుల మాటలు తమను ప్రభావం చేయలేవని, కోచ్‌తో మాట్లాడిన తర్వాతే అత్యుత్తమ ఆటగాళ్లను తీసుకుంటానంటూ చెప్పుకొచ్చాడు.

ఫాస్ట్‌ బౌలింగ్‌ పిచ్‌లపై అద్భుతంగా ఆడే సంజును, గంటకు 156 కిమీ వేగంతో బౌలింగ్‌ వేసే ఉమ్రాన్‌ మాలిక్‌ను బెంచ్‌కు పరిమితం చేయడంపై మాజీ క్రికెటర్లు కూడా ఆశ్యర్యం వ్యక్తం చేశారు.

అయితే హార్ధిక్ ప్ర‌వ‌ర్త‌న‌పై నెటిజ‌న్స్ దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. ఐదు మ్యాచ్‌లకే ఇంత అటిట్యూడ్ చూపిస్తే.. చాలా కష్టమని, టీమిండియా సారథిగా కొనసాగాలంటే ఒదిగి ఉండటం ముఖ్యమని సూచ‌న‌లు చేస్తున్నారు.

పూర్తి స్థాయి టీ20 కెప్టెన్‌గా బీసీసీఐ నుంచి అధికారిక ప్రకటన రాక ముందే.. నా జట్టు అంటూ హార్దిక్ వ్యాఖ్యానించడం బాలేదని విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు.

-Advertisement-

ఇలాంటి యాటిట్యూడ్ చూపించ‌డం వ‌ల్ల‌నే ముంబై ఇండియన్స్ అతన్ని వదిలేసిందని, ఈ తరహా ప్రవర్తన అతనితో పాటు జట్టుకు మంచిది కాదని సూచిస్తున్నారు.

గుజరాత్ టైటాన్స్ కెప్టెన్‌గా కూడా హార్దిక్ ఇలానే ప్రవర్తించాడని, మైదానంలో షమీ లాంటి సీనియర్ ఆటగాళ్లనే గౌరవం లేకుండా నోరు పారేసుకున్నాడని కొంద‌రు నెటిజ‌న్స్ గుర్తు చేస్తున్నారు.

అయితే టీమిండియా రెగ్యులర్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, వైస్‌ కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌, విరాట్‌ కోహ్లీ, దినేష్‌ కార్తీక్‌, అశ్విన్‌, షమీలకు విశ్రాంతి ఇచ్చి.. హార్దిక్‌ పాండ్యా కెప్టెన్సీలో యంగ్‌ టీమ్‌ను న్యూజిలాండ్‌తో టీ20కు పంపిన విష‌యం తెలిసిందే.

also read news:

‘రిచా చద్దా’ వివాదాస్పద ట్వీట్ తో దేశంలో తీవ్ర దుమారం.. క్ష‌మాప‌ణ‌లు చెప్పిన బ్యూటీ

బిస్లరీ యజమాని తన కంపెనీని ముఖేష్ అంబానీకి బదులుగా టాటాకు ఎందుకు విక్రయిస్తున్నాడు?

 

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News