Homelifestyle2022లో సెలబ్రిటీల వెకేషన్ కు వేదికలైన ఈ 5 ప్రదేశాలు !!

2022లో సెలబ్రిటీల వెకేషన్ కు వేదికలైన ఈ 5 ప్రదేశాలు !!

Telugu Flash News

ప్రసిద్ధ నటీనటుల ఇష్టాయిష్టాలు, పుట్టినరోజు, ఫ్యాషన్ స్టైల్, హాబీల గురించి మాకు, మీకు చాలా తెలుసు. ఇందులోనే మరో విషయం వస్తుంది. అదే వారికి ఇష్టమైన వెకేషన్ స్పాట్. ఎంతోమంది అభిమానులు తమ అభిమాన నటుడు/నటి ఇప్పుడు ఎక్కడికి వెళ్లారో తెలుసుకోవాలని కోరుకుంటారు.

సాధారణ మనిషి తన చురుకైన జీవనశైలి నుండి విశ్రాంతి తీసుకోవడానికి ఒకటి లేదా రెండు రోజులు అవసరం అయినట్లే.. సెలబ్రిటీలకు కూడా ఈ విశ్రాంతి, విరామం అవసరం. వాళ్ళు ఇష్టపడే ఇండియాలోని వెకేషన్ స్పాట్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

1. బికనీర్

bikaner2022లో సెలబ్రిటీలు ఎక్కువగా ఇష్టపడిన గమ్యస్థానం గురించి మాట్లాడితే.. ముందుగా గుర్తుకు వచ్చే పేరు “బికనీర్”. అవును.. బాలీవుడ్ నటులు, నటీమణులు, టీవీ నటులు, నటీమణులు ఈ రాజస్థాన్ నగరాన్ని ఎక్కువగా ఇష్టపడతారు. రాజస్థాన్‌లోని బికనీర్ జునాగర్ కోట, గజ్నేర్ ప్యాలెస్, లాల్‌ఘర్ ప్యాలెస్ , గజ్నేర్ వన్యప్రాణుల అభయారణ్యం వంటి ప్రదేశాలకు భారతదేశం అంతటా చాలా పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. ఉదయపూర్ రాచరిక ఆతిథ్యానికి ప్రసిద్ధి చెందినట్లే.. బికనీర్ కూడా ఈ జాబితాలో చేరింది. ఈ నగరం సెలబ్రిటీలకు అత్యంత ఇష్టమైన నగరంగా ఉండటానికి కారణం ఇదే.

2. రణతంబోర్

ranthamboreరాజస్థాన్‌లోని సెలబ్రిటీలు ఇష్టపడే మరొక ప్రదేశం రణథంబోర్.  ఉత్తరాన బనాస్ నది.. దక్షిణాన చంబల్ నదితో చుట్టుముట్టబడిన ఈ ప్రదేశం ప్రపంచవ్యాప్తంగా రాయల్ టైగర్లకు ప్రసిద్ధి చెందింది. బాలీవుడ్ సెలబ్రిటీలు ఇక్కడ జంగిల్ సఫారీకి వెళ్లడానికి బహుశా ఇదే కారణం కావచ్చు. ఈ ప్రదేశం రణతంబోర్ నేషనల్ పార్క్, రణతంబోర్ ఫోర్ట్, జోగి మహల్ మరియు రణతంబోర్ నుండి 20 కి.మీ దూరంలో ఉన్న సుర్వాల్ సరస్సులకు ప్రసిద్ధి చెందింది.

3. అలీబాగ్

alibagసెలబ్రిటీలు అలీబాగ్‌లో సెలవులు గడపడం లేదా వివాహాల కోసం ఈ స్థలాన్ని ఎంచుకోవడం ప్రారంభించినప్పటి నుండి, ఈ స్థలం ప్రజలలో కూడా ప్రసిద్ధి చెందింది. ముంబై నుండి అలీబాగ్‌ దగ్గరగా ఉండటం వల్ల సెలబ్రిటీలు ఇక్కడ వెకేషన్స్ కోసం వస్తుంటారు.  అలీబాగ్ దాని అందమైన బీచ్‌ లు భారతదేశం అంతటా చాలా ఫేమస్.

4. మనాలి

manaliహిల్ లేదా హిల్ స్టేషన్ విషయానికి వస్తే.. ముందుగా గుర్తుకు వచ్చే పేరు మనాలి. హిమాచల్‌లోని ప్రసిద్ధ హిల్ స్టేషన్ అయిన మనాలి, 2022లో సెలబ్రిటీలు ఎక్కువగా ఇష్టపడే ప్రదేశం. సినిమా నటులు, నటీమణులే కాదు, టీవీ స్టార్లు కూడా ఇక్కడ సెలవులు తీసుకుంటారు. కొవిడ్ తర్వాత పర్యాటకులు రికార్డు స్థాయిలో ఇక్కడికి తరలి రావడంతో ఈ ప్రదేశం ఫేమస్ అయింది.

-Advertisement-

5. ఉదయపూర్

udaipurభారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ‘సరస్సుల నగరం’గా ఉదయపూర్
ప్రసిద్ధి చెందింది.2022 సంవత్సరంలో ప్రముఖులు ఎంచుకున్న అత్యంత ప్రసిద్ధ గమ్యస్థానాలలో ఉదయపూర్ కూడా ఒకటి. ఉదయపూర్ సరస్సు పిచోలా, ఫతేసాగర్ సరస్సు మరియు జైసమంద్ సరస్సులకు ప్రసిద్ధి చెందింది. ఉదయపూర్ సిటీ ప్యాలెస్, సజ్జన్ గఢ్ ప్యాలెస్, వింటేజ్ కార్ మ్యూజియం మరియు సహేలియోన్ కి బారి వంటి ప్రదేశాలకు ఫేమస్.

ఇవి కూడా..

పైవి మాత్రమే కాదు.. లోనావ్లా, ముస్సోరీ, లడఖ్, జైపూర్, హైదరాబాద్ మరియు జోధ్‌పూర్ వంటి ప్రదేశాలను కూడా 2022 సంవత్సరంలో సెలబ్రిటీలు ఇష్టపడ్డారు.

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News