“సక్సెస్ ఫుల్ సీఈఓ” ఎవరు ? “సక్సెస్ ఫుల్ సీఈఓ” ఎలా ఉండాలి ? అన్నీ తానై సంస్థను ముందుకు నడిపే సీఈఓకు ఎలాంటి లక్షణాలు ఉండాలి ? సీఈఓకు తెలియాల్సిన విజయ సూత్రాలు ఏమిటి ? అత్యుత్తమ సీఈఓల 10 అత్యంత ముఖ్యమైన అంతర్గత లక్షణాలు ఏమిటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం..
1. పాజిటివిటీని పెంచి పోషించడం
గొప్ప సీఈఓ సంస్థలో పాజిటివిటీని పెంచి పోషిస్తాడు. పాజిటివ్ యాటిట్యూడ్ ను తన కోర్ టీమ్ లో పెంపొందిస్తాడు. బిజినెస్ కల్చర్ లో పాజిటివ్ వైబ్రేషన్ ఉండేలా చూస్తారు. ఉద్యోగుల పనితీరును ప్రోత్సహిస్తూ.. వారి నుంచి మెరుగైన ఫలితాలను సాధించే ప్రయత్నం చేస్తారు. కంపెనీలోని ఉద్యోగులు ఒక టీమ్ అనే భావనతో పనిచేసేలా వాతావరణాన్ని సిద్ధం చేస్తారు.
2. కంపెనీ లక్ష్యమే పరమార్ధం
కంపెనీ లక్ష్యమే పరమార్ధంగా సీఈఓలు పనిచేస్తారు. సంస్థలోని ప్రతి ఒక్కరు.. ప్రతి విభాగం ఆ లక్ష్యం గురించే ఆలోచించేలా సీఈవో ప్రోత్సహిస్తాడు. అందరికి నిత్యం ఆ లక్ష్యం గురించి గుర్తు చేసి దాని దిశగా సమాయత్తం చేస్తాడు. కంపెనీ విధించుకున్న లక్ష్యాన్ని చేరుకునేందుకు అనుసరించాల్సిన వ్యూహాన్ని కూడా సీఈఓ దిశానిర్దేశం చేస్తాడు.
3. పారదర్శక పనితీరు
గొప్ప సీఈఓ అనేవాడు అద్దంలా చాలా పారదర్శకంగా ఉంటాడు. కంపెనీ యాజమాన్యం లక్ష్యాలే తన లక్ష్యాలుగా ముందుకు సాగుతాడు. కంపెనీ యాజమాన్యం భావాలకు సీఈవో ప్రతిబింబంలా వ్యవహరిస్తారు. యాజమాన్యం ద్వారా అందే ఆదేశాలను నిజాయతీగా అమలు చేస్తాడు. దాపరికం లేని పారదర్శక పాలనా విధానం సంస్థలో ఉండేలా సీఈఓ పర్యవేక్షిస్తాడు.
4. భావ వ్యక్తీకరణలో స్పష్టత
సీఈఓ కు భావ వ్యక్తీకరణలో స్పష్టత ఉంటుంది. ఎవరితో ఎలా డీల్ చేయాలి ? ఎవరితో ఎలా మాట్లాడాలి ? ఎంత మాట్లాడాలి ? ఏమిటి మాట్లాడాలి ? అనేది సీఈఓ సీటులో ఉన్న వ్యక్తికి బాగా తెలిసి ఉంటుంది. యజమాన్యంతో ఎలా మాట్లాడాలి ? ఉన్నతాధికారులతో ఎలా మాట్లాడాలి ? సాధారణ ఉద్యోగులతో ఎలా మాట్లాడాలి ? అనేది సీఈఓ స్థాయి వారికి బాగా తెలుసు. సరళమైన భాషలోనూ అన్ని అంశాలను వివరించే నైపుణ్యం వారి సొంతం.
5. నిత్య విద్యార్థి
గొప్ప సీఈఓలు నిత్య విద్యార్థుల్లా ఉంటారు. వారు కొత్త కొత్త విషయాల గురించి విజ్ఞానాన్ని పెంచుకోవడానికి వెనుకాడరు. తమ పరిశ్రమ లేదా రంగంలో జరిగే కొత్త కొత్త మార్పులను ఎప్పటికప్పుడు తెలుసుకుంటారు. నాలెడ్జ్ పరంగా అప్ డేట్ అవుతారు. అయినా అన్నీ తెలుసు అనే భావన గొప్ప సీఈవో లకు ఉండదు. వినమ్రంగా తెలియని అంశాలను తెలుసుకునేందుకు ఉత్తమ సీఈవో ఎల్లప్పుడూ రెడీగా ఉంటారు.
6. శ్రద్ధగా వింటారు
ఒక స్మార్ట్ CEO ఇతరులు చెప్పేది శ్రద్ధగా వింటాడు. ఇతరులు చెప్పే విషయాల్లోని వివిధ దృక్కోణాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాడు. ఇతరులు మాట్లాడుతుండగా మధ్యలో జోక్యం చేసుకోరు. దీనివల్ల ఇతరులకు వారిపై నమ్మకం పెరుగుతుంది. ఈ విధానం వ్యక్తుల మధ్య సంబంధాలను మెరుగుపరుస్తుంది.
7. సిబ్బందికి సహకారం
అత్యుత్తమ సీఈఓలు తమ సిబ్బందిని పద్ధతిగా సంప్రదిస్తారు. వారు నిర్వహించే పనులు, సాధించగల ఫలితాలు, వారి పూర్తి సామర్థ్యాన్ని చేరుకోవడంలో సహాయపడే ఏవైనా సర్దుబాట్లను సీఈఓ పరిగణనలోకి తీసుకుంటారు. గరిష్ట విలువను సృష్టించడానికి ప్రతిభను పాత్రలతో సమలేఖనం చేయడానికి సీఈఓ ప్రయత్నిస్తాడు. ఉద్యోగుల నైపుణ్యాలను పెంచేందుకు ప్రత్యేక కార్యక్రమాలు అమలు చేస్తాడు.ఆ దిశగా సిబ్బందిని ప్రోత్సహిస్తాడు.
8.నిర్ణయం తీసుకునే సామర్థ్యం
అద్భుతమైన CEOలు సంస్థలోని విభిన్న బృందాలను సమీకరించే ప్రయత్నం చేస్తారు. ఇది ఆయా బృందాల నిర్ణయం తీసుకునే సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుందని నిరూపించబడింది. వారు D&I ప్రయత్నాలకు ప్రాధాన్యత ఇస్తారు. ఎందుకంటే సంస్థ యొక్క దీర్ఘకాలిక సాధ్యత , విజయానికి వైవిధ్యం ఎంత ముఖ్యం అనేది సీఈఓలు అర్థం చేసుకుంటారు.
9. ఫ్లెక్సిబుల్ గా ఉంటారు
విజయవంతమైన CEO లు చాలా ఫ్లెక్సిబుల్ గా ఉంటారు. ప్రతికూల పరిస్థితుల్లోనూ పాజిటివ్ గా ఆలోచిస్తారు. పరిస్థితులు అనుకూలంగా లేని సమయంలో ఎంతో తెలివిగా వ్యవహరిస్తారు. ఇతర వ్యక్తులను బాధపెట్టకుండా అడ్డంకులను అధిగమించడానికి ప్రయత్నిస్తారు. గొప్ప సీఈవోలు ప్రతికూల పరిస్థితులకు నిర్మాణాత్మకంగా ప్రతి స్పందించడానికి ప్రయత్నిస్తారు. భవిష్యత్తులో ఎదురయ్యే అడ్డంకులను ముందుగానే ఊహించే విజన్ గొప్ప సీఈవోల సొంతం.వాటిని ఎదుర్కోవాలనే తెలివితేటలు కూడా వారికి ఉంటాయి.
10.ఇతరులను ప్రేరేపిస్తాడు
అత్యంత ప్రభావవంతమైన సీఈవో తన సహచరులను సంస్థ లక్ష్యం సాధించే దిశగా ప్రోత్సహిస్తాడు.
CEO లు వారి లక్ష్యాలకు చాలా కట్టుబడి ఉంటారు. వారు కోరుకున్న గోల్ ను చేరుకోవడానికి యావత్ సంస్థను రెడీ చేస్తారు. అభిరుచితో నడిచే నాయకత్వం ఉద్యోగులను ప్రేరేపిస్తుంది. ఇది ఉత్పాదకతను పెంచుతుంది.
also read news:
Bigg Boss 6: నామినేషన్ లో అందరికి టార్గెట్ అయిన శ్రీహాన్..