Homebigg boss telugu season 6Bigg Boss Telugu Season 6 : టాప్ 5 కంటెస్టెంట్స్ వీళ్లే..!

Bigg Boss Telugu Season 6 : టాప్ 5 కంటెస్టెంట్స్ వీళ్లే..!

Telugu Flash News

Bigg Boss Telugu Season 6: బిగ్ బాస్ సీజ‌న్ 6 హౌజ్ నుండి ఆదివారం మ‌రొక‌రు ఎలిమినేట్ అయ్యారు. దీంతో హౌజ్‌లో కేవ‌లం 9 మంది స‌భ్యులు మాత్ర‌మే ఉన్నారు. వీరిలో ఎవ‌రు టాప్ 5లో ఉంటారు, ఎవ‌రు బాట‌మ్‌5లో ఉంటారు అనే అభిప్రాయం అంద‌రిలో ఉంది. దానిపై నాగార్జున తాజా ఎపిసోడ్‌లో చిన్న‌పాటి క్లారిటీ ఇచ్చారు. ఒక్కొక్కరిని కన్ఫెషన్ రూమ్‌లోకి పిలిచి బాటమ్ 5 కంటెస్టెంట్స్ ఎవరో చెప్పాలని నాగార్జున అడ‌గ‌డంతో ముందుగా ఆదిరెడ్డి కన్ఫెష‌న్ రూంకి వెళ్లాడు. అక్క‌డ కన్ఫెషన్ రూమ్‌లో నుండి అత‌ను చెబుతుంటే మిగిలి హౌస్‌మేట్స్ కూడా టీవీలో చూశారు.

ఒక్కో కంటెస్టెంట్ బాటమ్ 5 ఎవరో చెప్పిన వివరాలు చూస్తే….

ఆదిరెడ్డి: మెరీనా, రోహిత్, రాజ్, కీర్తి, ఇనయ;
ఇనయ: రాజ్, శ్రీసత్య, మెరీనా, రోహిత్, ఆదిరెడ్డి;
కీర్తి: శ్రీసత్య, మెరీనా, రాజ్, ఆదిరెడ్డి, శ్రీహాన్ ;
రాజ్: మెరీనా, రోహిత్, కీర్తి, ఇనయ, శ్రీహాన్;
ఫైమా: రోహిత్, మెరీనా, ఇనయ, కీర్తి, రాజ్;
మెరీనా: శ్రీహాన్, మెరీనా, రాజ్, ఇనయ, శ్రీసత్య/ఫైమా;
శ్రీహాన్: రోహిత్, మెరీనా, కీర్తి, రాజ్, ఆదిరెడ్డి;
రోహిత్: శ్రీహాన్, కీర్తి, మెరీనా, ఇనయ, రాజ్;
శ్రీసత్య: మెరీనా, కీర్తి, ఇనయ, రాజ్, రోహిత్;
రేవంత్: మెరీనా, కీర్తి, రాజ్, రోహిత్, ఇనయ ఇలా ఉన్నారు.

అయితే వీరిలో మేజారిటీ ప్ర‌కారం బాటమ్ 5లో ఇనయ, కీర్తి, రాజ్, మెరీనా, రోహిత్ ఉన్నారని నాగార్జున వెల్లడించారు. బాటమ్ 5లో ఉన్నవాళ్లు టాప్ 5 వెళ్లాలంటే ఎలా ఆడాలో అలా ఆడాలంటూ వారికి స‌లహ‌ ఇచ్చారు.

అయితే బాటమ్ 5 అనుకున్న వారిలో మెరీనా తాజా ఎపిసోడ్‌లో ఎలిమినేట్ అయ్యి వెళ్లిపోయారు. మెరీనాబయటకు రావడంతో రోహిత్ నార్మల్ గా ఉన్నట్టు కనిపించినా..దుఖాన్ని కంట్రోల్ చేసుకోలేక‌పోయాడు. అటు మెరీనా తన జర్నీ చూసుకుని.. బాగా ఎమోషనల్ కాగా, ఆ త‌ర్వాత ఇంటి స‌భ్యుల‌ని ప‌ల‌క‌రించి అంద‌రికి బెస్ట్ విషెస్ తెలియ‌జేసింది. ఇక అంతకు ముందు నాగార్జున హౌస్ మెంట్స్ లో.. సరదా సరదా గేమ్స్ ఆడించారు. ఇక అందరి దృష్టిలో టాప్ 5లో రేవంత్, శ్రీహాన్, ఫైమా, ఆదిరెడ్డి, శ్రీసత్యలు ఉండగా.. వీరిలో ఎవ‌రు క‌ప్ కొడ‌తారు అనేది చూడాలి.

also read news: 

-Advertisement-

మ‌హేష్ బాబు ప్రాప‌ర్టీని ధ్వంసం చేసిన బాల‌య్య ఫ్యాన్స్!

horoscope : 21-11-2022 ఈ రోజు మీ రాశి ఫలితాలు తెలుసుకోండి

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News