ఇటీవల జరిగిన టీ 20 వరల్డ్ కప్‌లో భారత్ సెమీస్ ఓడి ఇంటి బాట పట్టిన విషయం తెలిసిందే. ఈ సిరీస్‌లో భారత్ పర్‌ఫార్మెన్స్ చెత్తగా ఉండడంతో బీసీసీఐ దిద్దుబాటు చర్యలు మొదలు పెట్టింది. ఈ క్రమంలోనే చేతన్ శర్మ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీపై వేటు వేసింది. నూతన సెలక్షన్ కమిటీ కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తుంది.. పదవీ కాలం పూర్తి కాకముందే సెలక్షన్ కమిటీపై వేటు వేయడాన్ని బట్టి… బోర్డు ఎంత ఆగ్రహంతో ఉందో అర్థం అవుతుంది. అయితే బీసీసీఐ ఈ నిర్ణయం పట్ల విరాట్ కోహ్లి ఫ్యాన్స్ సంబరాలు చేసుకున్నారు. సోషల్ మీడియాలో మీమ్స్ తో రచ్చ చేస్తున్నారు.
గత ఏడాది టీ20 వరల్డ్ కప్‌లో భారత్ గ్రూప్ దశలోనే నిష్క్రమించడం.. తర్వాత కోహ్లి టీ20 వరల్డ్ కప్ కెప్టెన్సీ నుంచి వైదొలగడం, నెల రోజుల తర్వాత వన్డే కెప్టెన్సీ నుండి కూడా తొలగించారు . అప్పటి బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ , చేతన్ శర్మ వల్లనే కోహ్లీ ఈ నిర్ణయం తీసుకున్నాడని అభిమానులు భావించారు. ఇటీవలే గంగూలీ బీసీసీఐ అధ్యక్ష పదవి నుంచి దిగిపోగా.. తాజాగా చేతన్ శర్మ సెలక్షన్ కమిటీపై బోర్డు వేటు వేయడంతో.. కోహ్లి అభిమానులు ఫుల్ ఖుష్ అవుతున్నారు. ఇక్కడ విశేషమేమంటే.. 2021 నవంబర్ 18న కోహ్లిని కెప్టెన్‌గా తప్పిస్తే.. సరిగ్గా మరుసటి ఏడాది అదే రోజున చేతన్ శర్మపై బీసీసీఐ వేటు వేసింది.
ప్రస్తుతం గంగూలీ, చేతన్ శర్మ ఇద్దరూ లేరు.. విరాట్ కోహ్లి మళ్లీ ఫామ్‌లోకి ఫుల్ ఫామ్‌లో ఉన్నాడు. ఇక రోహిత్ శర్మ కూడా టీ20 కెప్టెన్సీని పోగొట్టుకునేలా కనిపిస్తున్నాడు. వీటన్నింటి ఆధారంగా విరాట్ ఫ్యాన్స్ ట్వీట్ల వర్షం కురిపిస్తున్నారు. గంగూలీ, చేతన్ శర్మ, రోహిత్ శర్మలని ట్రోల్స్ చేస్తూ వరుసగా ట్వీట్స్ చేస్తుండడంతో ఈ ఇప్పుడు విషయం క్రికెట్ ప్రపంచంలో హాట్ టాపిక్‌గా మారింది. అయితే నూతన సెలక్షన్ కమిటీ వచ్చే ఏడాది జనవరిలో బాధ్యతలు చేపట్టనుండగా, వారు టీ20లకు కొత్త కెప్టెన్‌ను నియమించే అవకాశం ఉంది.
also read news:
Bigg Boss Telugu Season 6: ఆదిరెడ్డి పై నాగార్జున ఫైర్..
క్రిస్ హేమ్స్‌వర్త్ కు అల్జీమర్స్ వ్యాధి..! షాక్‌లో ఫ్యాన్స్